ధన త్రయోదశి వేళ కుబేరయోగం.. వీరికి ధనపు రాశులతో లక్ష్మీదేవి కటాక్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా, అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అక్టోబర్ మాసంలో ఈ సంవత్సరం అరుదైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 29వ తేదీన ధనత్రయోదశి రాబోతుంది. ఈ సంవత్సరం ధన త్రయోదశి చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు.
ధనత్రయోదశి నాడు అరుదైన కుబేర యోగం
ధన త్రయోదశి శుభ సమయంలో బుధుడు మరియు శుక్రుడు కలయిక లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుండగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఇదే రోజు అత్యంత అరుదైన కుబేరయోగం ఏర్పడుతుంది. 62 ఏళ్ళ తర్వాత ధన త్రయోదశి నాడు కుబేర యోగం ఏర్పడుతుంది. దీంతో ధన త్రయోదశి నుండి కొన్ని రాశుల వారికి కుబేర కటాక్షం సిద్ధిస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

తులారాశి
ధన త్రయోదశి సమయంలో ఏర్పడే కుబేరయోగం కారణంగా తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు జీవితంలో పురోగతిని చూస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇది అన్ని విధాలా ఐశ్వర్యాన్ని ఇచ్చే సమయం. కెరీర్ లోను అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. ఈ సమయంలో కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి.
ధనుస్సు రాశి
ధన త్రయోదశి సమయంలో ఏర్పడే కుబేర యోగం ధనుస్సు రాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. ఈ సమయంలో వీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వీరికి లాటరీలు తగిలే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాలలో రాణిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగం చేసేవారు కూడా పురోగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు.
మీనరాశి
ధన త్రయోదశి సమయంలో ఏర్పడే కుబేర యోగం మీన రాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. నూతన గృహాల కొనుగోలుకు అవకాశం ఉంది. స్నేహితులతో ఈ సమయంలో సరదాగా గడుపుతారు. వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. తండ్రి మద్దతు బాగా లభిస్తుంది. ఎటువంటి కష్టాలనుండైనా ఈ సమయంలో బయటపడతారు. చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు ఈ సమయంలో వసూలవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications