తమలపాకులతో ద్వాదశ రాశులవారు ఇలా పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు!!
తమలపాకులకు హిందూ ధర్మ శాస్త్రాలలో చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. తమలపాకులలో శ్రీ మహాలక్ష్మి నివసిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. తమలపాకులు ఆరోగ్య పరంగాను, ఆధ్యాత్మికంగాను మేలు చేస్తాయి. అయితే తమలపాకులతో ద్వాదశ రాశుల వారు ఏ రోజు ఏ విధంగా పూజ చేయాలి? ఆ విధంగా తమలపాకులతో పూజ చేస్తే ద్వాదశ రాశుల వారికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశిలో జన్మించిన వారు మంగళవారం నాడు తమలపాకులతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి పూజకు మేషరాశి జాతకులు రెండు తమలపాకులను ఉంచి దానిపై మామిడిపండును సమర్పించి పూజించాలి. వృషభ రాశి వారు మంగళవారం పూట ఆలయానికి వెళ్లి రెండు తమలపాకులనుంచి దానిపై 9 మిరియాలనుంచి రాహు భగవానుడిని పూజిస్తే వారికి శుభం జరుగుతుంది.

ఇక మిధున రాశి జాతకులు బుధవారం పూట తమ కుల దైవానికి తమలపాకులు అరటి పండ్లు రెండింటిని ఉంచి పూజించాలి. ఇలా చేస్తే వారికి మంచి ఫలితాలు కలగడంతో పాటు, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి.కర్కాటక రాశి వారు శుక్రవారం కాళీమాత గుడికి వెళ్లి రెండు తమలపాకులు, దానిమ్మ పండును ఉంచి పూజిస్తే మంచి జరుగుతుంది. అంతేకాదు వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
సింహ రాశి జాతకులు గురువారం పూట తమ ఇష్టదైవానికి రెండు తమలపాకులను, అరటిపండ్లను ఉంచి పూజిస్తే వారికి కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. కన్యా రాశి వారు గురువారం పూట ఇష్టదైవానికి రెండు తమలపాకులను 27 మిరియాలను సమర్పిస్తే ఋణ బాధలు తొలగిపోతాయి. తులారాశి వారు శుక్రవారం పూట ఇంటి దైవానికి రెండు తమలపాకులు, లవంగాలను ఉంచి పూజిస్తే వారి సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఇక వృశ్చిక రాశి వారు మంగళవారం దుర్గాదేవికి రెండు తమలపాకులు, ఖర్జూరాలు ఉంచి పూజిస్తే, అంతా మంచే జరుగుతుంది.ధనుస్సు రాశి వారు తమలపాకులు, కలకండను ఉంచి పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మకర రాశి వారు శనివారం కాళికాదేవికి రెండు తమలపాకులు, బెల్లం పూజ పూజిస్తే అంతా శుభం జరుగుతుంది.
కుంభ రాశి వారు శనివారం పూట కాళికాదేవికి పూజ చేసి తమలపాకులను, అరస్పూను నెయ్యిని సమర్పిస్తే అంతా మంచే జరుగుతుంది. మీనరాశి జాతకులు తమ ఇష్ట దైవానికి తమలపాకులను పంచదారను ఉంచి పూజిస్తే జీవితంలో శుభాలు జరుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications