ధనత్రయోదశి సమయంలో అద్భుత యోగం ప్రకటించింది వీరికి కుబేర యోగం!
అక్టోబర్ నెలలో ధన త్రయోదశి రాబోతుంది. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 29వ తేదీన వస్తుంది. ధన త్రయోదశి శుభ సమయంలో బుధుడు మరియు శుక్రుడు కలయిక లక్ష్మీనారాయణ రాజయోగాన్ని సృష్టిస్తుంది. దీపావళికి ముందు ధన త్రయోదశి సమయంలో ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ధన త్రయోదశి నుండి స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మిధున రాశి
ధన త్రయోదశి నాడు ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు లక్ష్మీదేవితో ఆశీర్వదించబడతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కెరీర్లో ఊహించని పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో వీరికి ఆదాయం పెరుగుతుంది. అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి.

సింహరాశి
ధన త్రయోదశి సమయంలో ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ఆదాయాన్ని పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
తులారాశి
ధన త్రయోదశి సమయంలో ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం తులా రాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు జీవితంలో పురోగతిని చూస్తారు. కెరీర్ లోను అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి
ధన త్రయోదశి సమయంలో ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం వృశ్చిక రాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. ఈ సమయంలో వీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగం చేసేవారు కూడా పురోగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుంభరాశి
ధనద్రయోదశి సమయంలో ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం కుంభ రాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. తండ్రి మద్దతు బాగా లభిస్తుంది. ఎటువంటి కష్టాలనుండైనా ఈ సమయంలో బయటపడతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications