ఉసిరి రాజయోగంతో వారికి సిరిసంపదలు; ఈ నెలలో వీరి వెంటే అదృష్టం!!
గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించడం వల్ల యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు సానుకూల ఫలితాలను, కొన్ని యోగాలు ప్రతికూల ఫలితాలను, ఇంకొన్ని యోగాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. జాతకంలోని గ్రహాలు రాశులలో ఉండే స్థానాలను బట్టి రాశి జాతకులు యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
ఇక ఇటీవల కుజుడు మేషరాశిలో తిరోగమనం చేశాడు. మేష రాశిలో కుజుడు తిరోగమనం చేయడం వల్ల ఉసిరి రాజయోగం లేదా ఆమ్లా రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఉసిరి రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి సిరిసంపదలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

ఈ నెలలో మేష రాశి వారు ఉసిరి రాజయోగం తో అనేక సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి జీవితంలో ప్రేమ మరియు శృంగారం తృప్తిని ఇస్తాయి. వైవాహిక జీవితంలో కొత్త పరిణామాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వారి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అయితే శారీరక ఆరోగ్యం పట్ల ఈ సమయంలో జాగ్రత్త వహించాలని సూచించబడింది. అధిక ఒత్తిడిని తగ్గించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
ఉసిరి రాజయోగం వల్ల ఈ నెలలో మిధున రాశి జాతకుల భవిష్యత్తు బాగుంటుంది. మిధున రాశి జాతకులకు ఉసిరి రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉసిరి రాజయోగం వారి జీవితంలోని వివిధ అంశాలలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఇంతకాలం పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఏ పని చేసిన సులభంగా విజయం సాధిస్తారు. ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. సంపద విషయంలో జీవితం తృప్తిగా అనిపిస్తుంది.
ఉసిరి రాజయోగం వల్ల సింహ రాశి వారు ఈ నెలలో అదృష్ట రాశి జాతకులుగా ఉన్నారు. ఈ సమయంలో మీరు ఇతరులతో బలమైన అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. కెరీర్లో గణనీయమైన పురోగతిని సాధించడానికి ఇది సరైన సమయం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడానికి మరియు కెరీర్ సంబంధిత వెంచర్లలో సహకరించడానికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పబడింది. పాత స్నేహితులతో మళ్లీ అవకాశం ఉంది. ఈ సమయంలో వీరికి ఆర్థికంగానూ లాభదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications