ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
వేద జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రాశుల్లోకి గ్రహాల గమనం కారణంగా, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. ఏప్రిల్ మాసంలో మీన రాశిలో రాహువు కుజుడు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది. ఏప్రిల్ 23 నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ అంగారక యోగం ఉంటుంది. జూన్ 1వ తేదీన రాహువు తన రాశి అయిన మేష రాశికి వెళ్తాడు. అప్పుడు అంగారక యోగం ముగుస్తుంది.
జ్యోతిష శాస్త్రంలో అంగారక యోగాన్ని అశుభ యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాలలో తీవ్రమైన సమస్యలు వస్తాయి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేషరాశి, కన్యా రాశి, కుంభరాశి వారికి తీవ్రమైన కష్టాలు, నష్టాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండడం అవసరమని సూచిస్తున్నారు.

మేషరాశి
మీనరాశిలో కుజుడు రాహువు సంయోగం వల్ల ఏర్పడే అంగారక యోగం కారణంగా మేష రాశి వారికి తీవ్ర నష్టాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. రావలసిన డబ్బులు రావు. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కన్యారాశి
మేషరాశిలో కుజుడు రాహువు సంయోగం కారణంగా ఏర్పడుతున్న అంగారక యోగం కన్యా రాశి జాతకులకు అననుకూలంగా ఉంటుంది . ఇది సమస్యలను సృష్టిస్తుంది. ఈ సమయంలో మీరు నిగ్రహాన్ని కోల్పోయి, ఆలోచించకుండా మాట్లాడి ఘర్షణలకు దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటలపై నియంత్రణ ఈ సమయంలో అవసరమని సూచించబడింది.
కుంభరాశి
శని దేవుడి పాలిత రాశి అయిన కుంభ రాశి వారికి అంగారక యోగం కారణంగా కష్టాలు ఉంటాయి. కుంభరాశి జాతకులు ఈ సమయంలో కొన్ని ఆరోపణలను భరించవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అయినా సంసిద్ధంగా ఉండాలని సూచన.












Click it and Unblock the Notifications