ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే!
త్వరలో ఏప్రిల్ మాసం రాబోతుంది. ఏప్రిల్ మాసంలో రవి, శుక్ర, కుజ, బుధ గ్రహాలు వివిధ రాశులను మారుస్తూ సంచారం చేయబోతున్నాయి. ఈ మార్పు అన్ని రాశులపైన ప్రభావాన్ని చూపుతున్నా ముఖ్యంగా 6 రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఏప్రిల్ 14వ తేదీన రవి మేష రాశిలో ఉచ్ఛ స్థితిని పొంది కొన్ని రాశులకు అధికార యోగాన్ని అందించబోతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
రవి ఉచ్చస్థితి, శని వక్ర యుతి కారణంగా మేష రాశి జాతకులకు కలిసి వస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఆఫర్లు విజయవంతమవుతాయి. మేష రాశి వారి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కోర్టు కేసులు వివాదాలు పరిష్కారమై, ఆస్తి వస్తుంది.

మిధున రాశి
నాలుగు గ్రహాల మార్పుతో దశమ మరియు లాభ స్థానాలు బలంగా ఉండడం వల్ల మిధున రాశి వారికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయ వృద్ధి కలుగుతుంది. వృత్తిరీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది
కర్కాటక రాశి
బుధ, శుక్ర, కుజ, రవి మార్పుతో నవ మరియు దశమ స్థానాలు బలోపేతం కావడం వల్ల కర్కాటక రాశి వారికి ఆశించిన విదేశీ ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగులకు విదేశాలలో సంపాదన యోగం ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడి ఆదాయం పెరిగి శుభవార్తలు వినే పరిస్థితి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెంది లాభదాయకంగా ఉంటుంది.
సింహరాశి
సింహరాశికి రవి అధిపతి కావడంతో, రవి ఉచ్చ స్థానంలో ఉండడంతో ఈ సమయం సింహ రాశి వారికి కలిసొస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి స్థిరత్వం వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసివచ్చే అవకాశముంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడి, ఆదాయం పెరిగి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి
నాలుగు గ్రహాల మార్పుతో ధనుస్సు రాశి జాతకులకు ఏప్రిల్ మాసం అంతా పండుగలాగా ఉంటుంది. ధనస్సు రాశి జాతకుల ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సంతాన యోగం కలుగుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సామాజికంగా హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో బిజీగా ముందుకు వెళతారు.
కుంభరాశి
గ్రహాల మార్పుతో ధన, తృతీయ స్థానాలు పటిష్టమైన అనేక మార్గాలలో కుంభ రాశి వారికి ఆదాయం వస్తుంది. షేర్లు స్పెక్యులేషన్ లు ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలను ఇస్తాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వృత్తి వ్యాపారాలలో యాక్టివిటీ పెరుగుతుంది. గృహ, వాహన, సంతాన యోగాలు ఉన్నాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications