కుంభరాశి వారికి మార్చి నెల కలిసొస్తుందా? ఆ గ్రహాల సంచారం వల్ల ఊహించని ఫలితాలు!!

కుంభరాశి వారికి మార్చి నెలలో కొన్ని ప్రధాన గ్రహాల అనుకూల, మరికొన్ని గ్రహాల ప్రతికూల సంచారం వల్ల ఊహించని ఫలితాలు వస్తాయని చెప్తున్నారు.

జన్మ తేదీ, జన్మ సమయం ప్రకారంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు, శతభిషా నక్షత్రం ఒకటి, రెండు, మూడు. నాలుగు పాదములలో జన్మించిన వారు, పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి, రెండు, మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు . ఒకవేళ జన్మ నక్షత్రం జన్మతేదీ లేనివాళ్లు వాళ్ళ వ్యవహార నామమును బట్టి, అంటే వారి పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి రాశిని నిర్ధారించవలసి ఉంటుంది. గూ, గే, గో, సా, సి, సో, ద అక్షరాలు పేరులో మొదటి అక్షరం గా ఉన్నవారు కూడా కుంభ రాశి కిందికి వస్తారు.

స్థితిని బట్టి రాశి ఫలాలు మారతాయి

స్థితిని బట్టి రాశి ఫలాలు మారతాయి

రాశి ఫలితాలు కుంభరాశి వారు అందరికీ ఒకే మాదిరిగా ఉండవు. వారి వయసును, చేసే పనిని, ఉండే స్థితిని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. వాళ్లు ఉన్నటువంటి సామాజిక పరిస్థితి ఆధారంగా గ్రహ ఫలితాలు మారుతుంటాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జన్మ నక్షత్రం , జన్మరాశి ప్రకారంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోచార ఫలితాలను సమన్వయం చేసుకొని ఫలితాలను అంచనా వేసుకోవాలి.

మార్చినెలలో ప్రధాన గ్రహాల సంచారం ఇలా

మార్చినెలలో ప్రధాన గ్రహాల సంచారం ఇలా


ఒకటవ తారీఖు నుంచి 15వ తారీకు వరకు సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు ఒకటో తారీకు నుంచి 12వ తారీకు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 13వ తారీకు నుంచి మాసాంతం వరకు మిధున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు ఒకటో తారీకు నుంచి 16వ తారీఖు వరకు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు 16వ తారీకు నుండి మాసాంతం వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. గురుడు మొత్తం కూడా మీన రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఒకటో తారీకు నుంచి 12వ తారీకు వరకు మీన రాశిలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు తులా రాశిలో సంచరిస్తున్నాడు. మార్చి నెలలో ప్రధాన గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది.

కుంభ రాశి వారికి మార్చి నెలలో ఫలితాలు ఇలా

కుంభ రాశి వారికి మార్చి నెలలో ఫలితాలు ఇలా


ఇక మార్చి నెలలో కుంభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చూసినట్లయితే.. కుంభ రాశి వారికి గ్రహాల సంచారం వల్ల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని తెలుస్తుంది. ప్రధానమైనటువంటి గురుడు అనుకూలంగా ఉన్నాడు. శని, సూర్యుడు ప్రతికూలంగా ఉన్నారు. శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాల్లో మంచి జరిగే అవకాశం ఉంది. అయితే శని, సూర్యుడు ప్రతికూలంగా ఉండడం వల్ల ప్రతికూలతలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి కుంభ రాశి వారికి మార్చి నెల ఫలితం మిశ్రమంగా ఉంటుందని సూచించబడింది.

మార్చి నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇదే

మార్చి నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇదే


అంటే కొన్ని పనులలో వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీని కొన్ని పనులలో అనుకూల ఫలితాలు వస్తాయి కాబట్టి మానసిక సంతృప్తి, ఆనందము, ఉల్లాసము ఉండేటటువంటి అవకాశాలున్నాయి. వృత్తిపరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి . ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

విద్యార్థులకు ఈ నెలలో ఇలా

విద్యార్థులకు ఈ నెలలో ఇలా

ఇక మార్చి లో గురుడు అనుకూలించడం వల్ల కొన్ని అనుకున్న ప్రణాళికలు విజయవంతం చేస్తారు. గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుతారు.కానీ మార్చి నెలలో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని హెచ్చరించబడింది.ఇక విద్యార్థులు విద్యాపరమైన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు,కొంత ఆందోళనకు గురవుతారు. అయినప్పటికీ విద్యార్థులకు విద్యలో అనుకూల ఫలితాలు వస్తాయి.

ఏ పని చేసినా ఆచి తూచి నిర్ణయం తీసుకోండి

ఏ పని చేసినా ఆచి తూచి నిర్ణయం తీసుకోండి

అయితే ఊహించని ఇబ్బందులు ఎదురు కావడంతో అసహనానికి గురి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొన్ని విషయాలలో శని, రవి, అంగారకుడి మూలంగా ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉండవచ్చును. కనుక తొందరపడకుండా అసహనానికి గురి కాకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా చూస్తే కుంభ రాశి వారు మిశ్రమ ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఏదైనా పని చేయాలనుకుంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించబడింది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+