బెడ్ క్రింద ఈ వస్తువులు పెడుతున్నారా? మీ కొంప కొల్లేరే!
వాస్తు శాస్త్రంలో ఇంటిని ఏ విధంగా అయితే వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా అదేవిధంగా వాస్తును పాటించాలి. చాలామంది బెడ్ రూమ్ విషయంలో, బెడ్ విషయంలో వాస్తు నియమాల విషయంలో పట్టింపు లేనట్టు వ్యవహరిస్తారు. ముఖ్యంగా బెడ్ విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
బెడ్ క్రింద వస్తువులు పెట్టటం మంచిదేనా?
బెడ్ కింద ఏది పడితే అది పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ఇటీవల కాలంలో బెడ్ కింద స్పేస్ వాడుకోవడం కోసం సెల్ఫ్ లు ఇస్తున్నారు. ఇక వాటిలో ఎవరికి నచ్చినట్టు వారు వస్తువులను నింపేస్తున్నారు. వాస్తు ప్రకారం అలా వస్తువులను మంచం కింద పెట్టడం మంచిదేనా? ఎలాంటి వస్తువులను మంచం కింద పెట్టకూడదు? తెలుసుకుందాం రండి.

ఈ వస్తువులు బెడ్ క్రింద పెడితే నెగిటివ్ ఎనర్జీ
వాస్తు ప్రకారం మంచం కింద లోహాలకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదు. ఇనుముతో తయారు చేసిన వస్తువులు, పదునైన వస్తువులు, డబ్బాలు, స్టీలు వస్తువులు పెట్టకూడదు. గాజు వస్తువులు పెట్టకూడదు. ఇవి కుటుంబంలో విభేదాలకు కారణమవుతాయి. వాస్తు ప్రకారం మంచం కింద చెప్పులు, బూట్లు పెట్టకూడదు. ఇలా పెడితే ఇంట్లో ప్రతికూల శక్తి ఆకర్షితమవుతుంది.
ఈ వస్తువులు బెడ్ క్రింద ఉంటే ఆర్ధిక సమస్యలు
చెప్పులు, బూట్లు బయట నుండి దుమ్ము ధూళి తో పాటు ప్రతికూల శక్తులను ఇంట్లోకి తీసుకువస్తాయి. వీటిని మంచం కింద పెట్టుకుంటే ఆరోగ్యానికి హానికరం.వాస్తు ప్రకారం చినిగిన బట్టలను పాత వస్తువులను మంచం కింద పెట్టకూడదు. వీటిని మంచం కింద పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మంచం కింద పెట్టకూడదు వీటిని మంచం కింద పెట్టుకుంటే నిద్రా భంగం కలిగే ప్రమాదం ఉంది.
ఇవి మంచం క్రింద ఉంటే ఆరోగ్యానికి హాని
వాస్తు ప్రకారం ఆహార పదార్థాలను కూడా మంచం కింద పెట్టకూడదు. వీటితో కూడా అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఇవి బ్యాక్టీరియాను ఆకర్షిస్తాయి. ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇక వాస్తు ప్రకారం చెప్పాలంటే మంచం కింద ఖాళీగా ఉంచితే మంచిది. గాలి సరళంగా సంచరించటానికి, సానుకూలత గది అంతా వ్యాప్తి చెందడానికి మంచం కింద ఖాళీగా ఉంటే సాధ్యపడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications