Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నం పారేస్తున్నారా? భోజనం విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? మహాదోషం!

అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. అటువంటి అన్నాన్ని మనం ఎప్పుడూ గౌరవించాలి. భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా భోజన నియమాలను పాటించాలి. భోజనం పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండాలి. చాలామంది భోజనం చేసేటప్పుడు తెలియకుండానే చెయ్యకూడని తప్పులు చేస్తూ ఉంటారు. పొరపాటున ఇటువంటి తప్పులు చేస్తే మహా పాపం తగులుతుందని చెబుతున్నారు పండితులు.

పిల్లలకు భోజనం పెట్టి ఈ పని చెయ్యొద్దు
మరి భోజనం చేసేటప్పుడు చేయకూడని ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం. భోజనం చేసే సమయంలో చాలామంది పిల్లలను తిడుతుంటారు. భోజనం పెట్టి పిల్లలను తిట్టడం ఏమాత్రం మంచిది కాదు. అలా చేస్తే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతారు. కాబట్టి మీకు దోషాన్ని కలిగించే ఈ పని చేయకండి.

Are you throwing away rice making these mistakes with your meals gives maha dosha

భోజనం విషయంలో ఇలా ఉంటే దోషం
కొంతమంది భోజనం చేసే సమయంలో ఆగ్రహంతో పళ్ళాన్ని పక్కకు నెట్టడం ,అన్నం విసిరి కొట్టడం వంటి పనులు చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా చేసిన వారికి ఫుడ్ దొరక్కుండా పోతుంది. కనుక ఇలా చేయకండి. కొంతమంది భోజనం చేయమంటే తినే అన్నం పైన విసుగును నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. అలా భోజనం చేయాలంటే నిర్లక్ష్యం చేసే వారికి భోజనం దొరకని పరిస్థితి వస్తుందని చెబుతున్నారు పెద్దలు.

అన్నం మీద అలగటం కూడా దోషమే
కొందరు భోజనం చేయకుండా అలిగి మానేస్తారు. ఇంట్లో వాళ్ళతో గొడవపడి తిండి మీద అలగడం కూడా దోషమే. భోజనం ఎప్పుడు కోపతాపాలకు తావు లేకుండా పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. కొంతమంది భోజనం చేసే సమయంలో అనుచితమైన విషయాల గురించి మాట్లాడుతారు. ఇది కూడా మంచిది కాదు .

అన్నం పారేస్తున్నారా? అయితే మహా పాపం
ఇంకొంతమంది ప్లేట్లలో పెట్టిన అన్నాన్ని తీసుకెళ్లి డస్ట్ బిన్లలో పారేస్తారు. ఇలా చేసినా మహా పాపం తగులుతుందని చెబుతున్నారు. భోజన సమయంలో ఈ దోషాలకు పాల్పడితే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక్కొక్కసారి భోజనం దొరక్క ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. కనుక ఎవరైనా సరే భోజనం విషయంలో అన్నానికి గౌరవం ఇవ్వాలి. భక్తి భావంతో అన్నాన్ని తీసుకుంటే అది మంచిది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+