ఆషాఢ అమావాస్య 2024: చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి ఇవే.. తెలుసుకోండి!!
హిందువులు ముఖ్యంగా భావించే తిధులలో అమావాస్య ఒకటి. త్వరలో ఆషాడ అమావాస్య రాబోతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాడ అమావాస్య చాలా ముఖ్యమైన తిధి. ఈ సంవత్సరం జూలై 5వ తేదీన ఉదయం 4. 45 నిమిషాలకు ఆషాడ అమావాస్య వస్తుంది. ఇది మరుసటి రోజు జులై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది.
త్వరలో ఆషాఢ అమావాస్య
అయితే జులై ఐదవ తేదీన ఉదయం అమావాస్య ఉంది కాబట్టి జూలై 5వ తేదీనే ఆషాడ అమావాస్యను జరుపుకుంటాం. అయితే ఆషాఢ అమావాస్య నాడు పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. ఇక ఆషాడ అమావాస్య నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి.

ఆషాఢ అమావాస్య నాడు చెయ్యాల్సింది ఇదే
ఆషాడ అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇస్తే పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది. అంతేకాదు ఆషాడ అమావాస్యనాడు అశ్వద్ధ వృక్షం కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది. ఇక ఆషాడ అమావాస్య రోజు ఉప్పు, పంచదార, బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది. పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది.
పూర్వీకుల ఆశీస్సుల కోసం ఇవి చెయ్యండి
అంతేకాదు ఈ రోజు కాకులకు, పక్షులకు, కుక్కలకు ఆహారం పెట్టాలి.రావిచెట్టుకు గానీ, మర్రి చెట్టుకు గానీ నీరు పోయాలి.అమావాస్య నాడు మధ్యాహ్నం పితృ దేవతలకు ధూపం సమర్పించాలి. ఇలా చేస్తే పితృ దేవతలు దీవించి వెళ్తారు. అత్యంత భక్తి భావంతో పితృ దేవతలను స్మరించుకోవాలి.
ఆషాఢ అమావాస్య నాడు చెయ్యకూడని పనులు ఇవే
ఆషాడ అమావాస్య రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఎవరైనా పొరపాటున ఆషాడ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే వారికి కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అసలు ఆషాడ అమావాస్య రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఈరోజు మద్యం సేవించడం, మాంసాన్ని తినడం మానుకోవాలి. ఆషాఢ అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలు పడకూడదు.












Click it and Unblock the Notifications