ఆషాడ మాసంలో నిష్ఠగా ఈ పూజలు చెయ్యండి.. మీరే కుబేరులు!!
ఆషాఢ మాసం రానే వచ్చింది. ఆషాఢ మాసానికి హిందూ క్యాలెండర్ లో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది.ఆషాఢ మాసం ఈ సంవత్సరం జూలై 6వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసానికి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం అత్యధికంగా దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక ఈ మాసంలోనే వారాహి నవరాత్రులు, కర్కాటక సంక్రాంతి, జగన్నాథుడి రథయాత్ర, దేవశయన ఏకాదశి వంటి అతి ముఖ్యమైన పండుగలు వస్తాయి.
ఆషాఢ పూజలతో అవుతారు కుబేరులు
ఇంత ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న ఆషాఢ మాసంలో కొన్ని రకాల పూజలను చేయడం మిమ్మల్ని కుబేరులు చేస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే వారాహి దేవి నవరాత్రులను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే ఖచ్చితంగా సంపన్నులు అవుతారని చెబుతారు. అంతేకాదు ఆషాఢమాసం అనేది గ్రామదేవతలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గ్రామదేవతలకు ఈ మాసంలో బోనాలను నిర్వహిస్తారు.

గ్రామ దేవతలకు మొక్కులు
గ్రామదేవతలకు మొక్కలు చెల్లించుకోవలసిన వారు ఆషాఢమాసంలోనే గ్రామ దేవతలకు మొక్కలు చెల్లించుకుంటారు. గ్రామ దేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ, కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆషాఢమాసంలోనే గ్రామ దేవతలను పూజిస్తారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ వంటి అనేకమంది గ్రామదేవతలకు ఆషాడమాసంలో మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు పూజారికాలు నిర్వహిస్తే మంచి జరుగుతుంది.
ఆషాఢమాసంలో ఈ పనులు చెయ్యాలి.. సత్ఫలితాలు
అంతేకాదు ఆషాఢ మాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సమీపంలో ఉన్న నదిలో గాని, తటాకంలో గాని స్నానం చేసి శ్రీమహావిష్ణువుని నిష్ఠతో పూజించి గోవులకు గడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆషాఢ మాసంలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడం అమ్మవారికి పూజలు చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెబుతారు. ఆషాఢమాసంలో దానాలు చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తాయి.
నియమ నిష్ఠలతో పూజిస్తే మీరే కుబేరులు
ఈ మాసంలో పేదవారికి బ్రాహ్మణులకు వస్త్రదానం, అన్నదానం వంటివి నిర్వహించినట్లయితే ధనయోగం కలుగుతుందని పెద్దలు చెబుతారు. గోసేవ చేయడం దానధర్మాలు చేయడం ఈ మాసంలో చేస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాదు ఆషాఢమాసంలో పుణ్యక్షేత్రాలను సందర్శించడం కూడా మంచిదని కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెబుతున్నారు. కనుక ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను, వారాహి అమ్మవారిని, శ్రీమహావిష్ణువుని, నియమ నిష్ఠలతో పూజిస్తే కచ్చితంగా కుబేరులు అవుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications