ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలు, చెయ్యకూడని పనులు ఇవే!!

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలలో ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకం. ముఖ్యంగా ఆషాఢ మాసానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢ మాసం లోనే మనకు వర్షాకాలం కూడా ప్రారంభమై వర్షాలు కురుస్తాయి. సహజంగా ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో ఆధ్యాత్మికతకు సంబంధించి, మతపరమైన అనేక కార్యక్రమాలను చేస్తారు.

ఆషాఢ మాసంలో అష్టైశ్వర్యాలు కలిగేలా విష్ణు పూజలు
ఈ సంవత్సరం ఆషాఢమాసం నిన్నటి నుంచి ప్రారంభమైంది జూలై 21వ తేదీతో ఆషాఢమాసం ముగుస్తుంది. ఈ మాసంలో విష్ణువుని శివుడిని పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చెబుతారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో భగవన్నామ స్మరణ మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఎవరైతే శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు.

ashadha masam 2024 rules to be followed and avoid these things for health and wealth

ఆషాఢమాసంలో ఈ పనులు చెయ్యరాదు
ఈ మాసంలో కుజుడుని పూజించడం వల్ల జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని, ఆషాఢమాసంలో దుర్గాదేవిని పూజించడం కూడా మంచిని చేకూరుస్తుందని చెబుతున్నారు. ఇంత పవిత్రమైన ఆషాఢమాసంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కొత్తగా పెళ్లయిన జంటలు ఆషాడంలో కాపురం చేయకూడదు.

కొత్త కోడలు తన పుట్టింటికి వెళ్ళాలి
కొత్తకోడల్ని కచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఎందుకంటే ఆషాఢ మాసం మహిళలు గర్భం ధరించటానికి సరైన మాసం కాకపోవడం వల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లకపోతే అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయని చెబుతున్నారు. ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లకపోతే అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయని చెబుతున్నారు. మాసం వర్షాకాలం కావడంతో అనారోగ్యాలు వచ్చే మాసంగా చెబుతారు.

ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలివే
జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆషాఢ మాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. ఆషాఢమాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు. ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చద్ది అన్నాన్ని తినడం మానేయాలి. ఆషాఢమాసంలో ఆకుకూరలు, మాంసం, చేపలు, మద్యం, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకోకూడదు. ఇక ఆషాఢ మాసంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+