శ్రీకృష్ణ జన్మాష్టమిపై ఎప్పుడూ తికమక వద్దు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: శ్రీకృష్ణావతార దివ్య సందర్భమునకు సంబంధించిన వ్రతములు రెండు (1) శ్రీకృష్ణ జన్మాష్టమి (2) శ్రీకృష్ణ జయంతి.

ప్రమాణము
శ్రావణ కృష్ణాష్టమికి నిశీథ వ్యాప్తిని బట్టి శ్రీకృష్ణజన్మాష్టమి నిర్ణయమవుతుంది. ఉదయిక సప్తమి నాడు మాత్రమే అష్టమికి కొద్దిగా రాత్రికి వ్యాప్తి యుండి, మరునాడు - ఉదయికాష్టమి నాడు రాత్రికి స్పర్శయైనను లేనిచో - సప్తమినాడే శ్రీకృష్ణ జన్మాష్టమి యని - కాలమాధవీయము, నిర్ణయసింధు, ధర్మసింధు మన్నగు ప్రమాణ గ్రంథములలోని నిర్ణయము చేసారు.

మరి ఎన్నడు పండుగ ?
ఈ సంవత్సరము శ్రావణ కృష్ణ సప్తమీ సోమవారము (14.08.2017) నాడు మాత్రమే అష్టమికి సంపూర్ణ నిశీథ వ్యాప్తి యున్నది. మరునాడు అష్టమి సా. 05:07 వరకు మాత్రమే ఉండుటచే 14-08-2017 సోమవారము నాడే నిస్సందేహముగ శ్రీకృష్ణ జనాష్ణమి అగును.

astrologer tells about Sri krishna Janmashtami

శ్రావణ కృష్ణాష్టమికి రోహిణీ యోగమును బట్టి శ్రీకృష్ణ జయని నిర్ణయమగును. ఈ అష్టమీ-రోహిణీ యోగము పగలు గాని రాత్రిగాని - ఒక ముహూర్త మాత్రమైనను ఉండవలెను. నిశీధమున (రాత్రి) ముఖ్యము అనుకల్పముగా రవి సింహరాశిలో నుండగా భాద్రపద కృష్ణాష్టమికి రోహిణీ యోగము వచ్చినను శ్రీకృష్ణ జయంతి యగును.
ఇది ఒక అలభ్యయోగము వంటిది. ప్రతి సంవత్సరము వచ్చునను నియమము లేదు. ఒకప్పడు శ్రావణ భాద్రపదముల రెండింటిలోను రావచ్చును. అపుడు శ్రావణముననే శ్రీకృష్ణ జయంతి యగును.

ఒకప్పడు శ్రావణమున జన్మాష్టమి - జయని ఒకే రోజున పడవచ్చును. లేదా పూర్వ పర దినములలో ఒకటి ముందు రోజు, రెండవది మరునాడు కావచ్చును. ఇట్టి సందర్భములలో మాత్రము జన్మాష్టమిని జయనితో కలిపియే చేయవలెనని గాని విడిగా కాదు.

జన్మాష్టమి నాడు చేయవలసినది - ఉపవాసము, జాగరణము శ్రీకృష్ణాదుల, చంద్రార్ష్యము మొదలైనవి (కాల మాధవీయము, పుట 222). జన్మాష్టమి నాడు కూడా అవే కానీ, తేడా ఏమనగా - జయంతి నాటి ఉపవాసము దానాది సహితము. జన్మాష్టమి నాడు ఉపవాసము మాత్రమే అని కాలమాధవీయమున వివరణ (పుట. 230/231).

వైష్ణవులకు
కాలమాధవీయము, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలనిర్ణయచ్యన్షిక మన్నగు ప్రమాణ గ్రంథములలో జన్మాష్టమి / జయంతుల విషయమున స్మార్త - వైష్ణవ ప్రసక్తి . జన్మాష్టమి నిత్యము. జయంతి కామ్యము. అయినాకుడా వైష్ణవుల ఆచారము మరొక విధముగా ఉంటున్నది. కనుక కాలమాధవీయాదుల నిర్ణయము స్మార్త పద్ధతి యని అనబడుచున్నది.ఇలా స్మార్త పద్ధతిలో ఈ సంవత్సరము శ్రావణమున జయని యోగము లేదు. భాద్రపదమున కృష్ణ సప్తమి మంగళవారము (12-09-2017) రాత్రి 01:01 నుండి మరునాటి రాత్రి 10:47 వరకు అష్టమి ఉన్నది. అనగా దినద్వయమున అష్టమికి నిశీథ వ్యాప్తి లేదు. కాని రోహిణి మంగళవారము ఉదయము 07:54 నుండి బుధవారము ఉదయము 06:27 వరకు ఉండుటతో అష్టమికి దిన ద్వయమున నిశీథాదన్యత్ర రోహిణీ యోగము పట్టినది.

వాజివిద్దాష్టమీ త్యాజ్యా - అగ్నివిద్దా తు రోహిణీ
కాగా, ఈ సంవత్సరము భాద్రపద కృష్ణాష్టమి బుధవారము (18-09-2017) నాడు వైష్ణవులకు కూడ శ్రీకృష్ణజయని యగును. ఇలా ఈ సంవత్సరము భాద్రపద కృష్ణాష్టమి బుధవారము 13-9-2017) స్మార్త / వైష్ణవుల కందరకును శ్రీకృష్ణ జయని యగును. అందరకును శుభము. ఒక ముహూర్త మాత్రమైనను ఉండవలెను.

స్మార్తులకి
దినద్వయేలి_పి నిశీథావ్యాపినీ (అష్టమీ) పూర్వేద్య రేవ నిశీథాదన్యత్ర రోహిణీ యుతా అత్ర పరైవగ్రాహ్యా ! అతైవ పక్షే పరేద్య రేవ ఉభయత్ర వా నిశీథాదన్యత్ర రోహిణీ యోగేవి_పి పరైవేతి కైమతికన్యాయేన సిద్ధమ్ | అని (ధర్మసింధు, పుట 131లో) నిష్కర్క చేయుటతో 13-092017 బుధవారము నాడు స్మార్తులకు శ్రీకృష్ణ జయని యగును.
వైష్ణవులకు నక్షత్రము, వేధ, సౌరమాసము ప్రధానములు. సింహ మాసమున కృష్ణ పక్షాష్టమికి రోహిణీ యోగమున్నపుడు శ్రీ కృష్ణజయని (జన్మాష్టమి దానిలోనే గతార్ధము) యగును. అష్టమి / రోహిణులకు నిశీథ వ్యాప్తి అవసరము లేదు. అష్టమికి సప్తమీ వేధ గాని, రోహిణికి కృత్తికా వేధ గాని ఏ మాత్రము పనికి రావు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about Sri krishna Janmashtami date.
Please Wait while comments are loading...