వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్త - అవ్యక్త ప్రకృతి: చైతన్య శక్తి అంటే ఏమిటి?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

వ్యక్త - అవ్యక్త ప్రకృతి - శక్తి తరంగాల క్షేత్రం - సృష్టికి ఉత్పత్తికి మూలకారణం చైతన్యశక్తి. ఈ చైతన్య శక్తి మనిషిలో బుద్ధి రూపంలో ఉంటుంది. దీని కారణంగానే ప్రపంచంలో మనిషి రకరకాలుగా అభివృద్ధి సాధిస్తున్నాడు. వివేకం, విచక్షన కూడా ఉన్నందువల్లే అతడు ఉచితానుచితాలను, సరియైన నిర్ణయాలను తీసుకోగలుగుతున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ, అనుభవం తోడయ్యే, వివేకం, ఆలోచనాశక్తి పెరుగుతాయి. ఇతర ప్రాణుల్లో ఈ శక్తి లేని కారణంగా, అవి మనుష్యుల్లాగా చింతన, మన నం చేయలేవు.పైన తెలిపిన చేతనాశక్తి బ్రహ్మాండమంతా వ్యాప్తి చెంది ఉంది.

బుద్ధి నుండి ఉత్పన్నమయ్యే తరంగాల్ని ఈ చైతన్యమే తనలో నిలుపుకుంటుంది. ప్రతి బుద్ధి నుండి వెలువడే తరంగాలు వేరువేరు ఫ్రీకెన్సీల్లో వెలువడతాయి. సృష్టిలో ఎన్ని మస్తిష్కాలు (బుద్ధులు) ఉన్నాయో అన్నివేర్వేరు ఫ్రీకెన్సీలు ఉంటాయి. బ్రహ్మాండంలో అంతా, వేర్వేరు ఫ్రీకెన్సీల్లో, బుద్ధి నుండి వెలువడే తరంగాలు అన్ని వేళలా వ్యాపిస్తూ ఉంటాయి.

Astrologer told the story about Conscious energy

బుద్ధి నుండి తరంగాలు ఉత్పన్నం అవుతాయి, అలాగే అదే బుద్ధి తరంగాల్ని గ్రహిస్తుంది కూడా. బుద్ధి ద్వారా మనం చేసే ఆలోచనలు, కలిగే భావాలు, ఊహించే కల్పనలు, తీసుకునే సంకల్పాలు, అన్నీ తరంగా లుగా మారి బ్రహ్మాండమంతా వ్యాపిస్తాయి. వీటినే ఏదో ఒక బుద్ధి గ్రహిస్తుంది.

గ్రహించి ఆ తరంగాల్లో వుండే ఆలోచనల ప్రకారం బుద్ధిలో ఆలోచనలు రేకెత్తుతూ ఉంటాయి. విశేషమైన పనుల ప్రభావంలో ఒకేరకమైన తరంగాలు కొన్ని విశేష స్థానాల్లో గుమిగూడుతాయి. ఈ కారణంగా ఆయా స్థానాల్లో వాటి ప్రభావం బాగా పడుతుంది. ఎలాంటే మనం కనుక గుడికి వెళ్తేనో లేదా ఎవరైనా సాధువు- మహాత్ముల దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడో మన ఆలోచనలు పరిశుద్ధంగా, సాత్వికంగా అవుతాయి.

అదే మనం కనుక బాగా జనసమర్థం ఉన్న చోటికి వెళ్లినప్పుడు, అంటే హోటల్‌ లేక పిక్చర్‌ హౌస్‌కి వెళ్లినపుడు మన ఆలోచనలు, భావాలు భౌతిక విషయాలవైపు ఎక్కువగా ఆకర్షించబడ తాయి. పైన తెలిపిన రహస్యం తెలియని కారణంగా మనిషి, తరంగాల ద్వారా గ్రహించిన ఆలోచనల్ని తన స్వంత ఆలోచనలుగా భావిస్తారు. ఈ శాస్త్రంలో భాగంగానే భావతరంగాలు కూడా బ్రహ్మాండంలో ఎల్లప్పుడూ వ్యాపించి ఉండడం వల్ల, ప్రతి మనిషీ ఎవరో ఒకరిని భావతరంగాల్ని గ్రహించి, అలా గ్రహించిన భావనల ప్రకారంగా స్వయంగా భావించుకుని, ఆ భావన తనదనే అనుకుంటాడు.

బుద్ధి నుండి స్వీయభావనే కాక ఇతరుల భావనలు కూడా బ్రహ్మాండం నుండి గ్రహించబడతాయి. సాధారణంగా మానవునికి తన భావన ఏదో, మరి స్వీకరించిన పరుల భావం ఏదో అతనికి తెలియదు.

ధ్యానాదుల్లో నిమగ్నమైన వ్యక్తుల బుద్ధి, బ్రహ్మాండ తరంగాల చేత తక్కువగా ప్రభావితమై ఉన్నందున వారికి భావనలు ఎలా ఉత్పన్నమౌతాయో, ఉత్పన్నమైనవి వారివో కావో లేక బుద్ధి ద్వారా బయటనుండి గ్రహించబడినవో లేవో కూడా వారికి తెలుస్తుంది.

అలాగే వారికి తమ మస్తిష్కం నుండి ఉత్పన్నమైన ఆలోచనలు వారి స్వంతమూ లేక బయటనుండి గ్రహించబడినవా అనే విషయం కూడా వారిక తెలుస్తుంది.

బుద్ధిలో, ఆలోచనలు, భావాలు, చింతనలు, చైతన్య శక్తి కారణంగా ఉత్పన్నమై, తిరిగి ఆ చైతన్యవ్యక్తిలోనే తరంగ రూపంలో ఉంటాయి. ఇవే తరంగాలు తిరిగి మరో మస్తిష్కం లోకి ప్రవేశిస్తాయి. ఆ బుద్ధి తన స్వభావ, సంస్కారాల్ని బట్టి, ఆ విషయంలో కలతబడడమో లేక బాగా చింతన-మననం చేయడమో చేస్తుంది. ఇదే క్రమం ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది.

ఇది ఎంతగా విస్తరిస్తుంది అంటే ఎవరూ దీని గురించి ఇంత అని అంచనావేయలేరు.

బ్రహ్మాండంలో సదా-సర్వదా ఈ తరంగాలు వ్యాపించి ఉండడం కారణంగా దాన్ని 'తరంగాల క్షేత్రం' అని కూడా అనవచ్చును. ఇవన్నీ కూడా చైతన్యశక్తి కారణంగా జరగడం వల్ల దాన్ని చైతన్యక్షేత్రం అని కూడా అనవచ్చును. ఈ క్షేత్రంలో అన్ని రకాల మంచి చెడు ఆలోచనల- భావాల తరంగాలుంటాయి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా సత్‌-రజ, తమో గుణాలుగా విభజించవచ్చు. దీనినే 'త్రిగుణాత్మక ప్రకృతి' అని కూడా అంటారు.

ఈ ప్రపంచం లోని ప్రతి ప్రాణీ కూడా ఈ మూడుగుణాల్లోని ఏదో ఒకగుణంతో ప్రతి క్షణం ప్రభావితం అయ్యి, దాని ప్రకారంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అజ్ఞానవ శాత్తూ, మోహించిన ఆ భావాన్ని తన భావంగా భావించుకుని హర్షమో, శోకమో ఏదో ఒకటి వ్యక్త పరుస్తారు. ఆ భావం బ్రహ్మాండంలోంచి తన బుద్ధి స్వీకరించిందని గాని, తదనుసారంగా తాను కర్మలను ఆచరిస్తున్నానని గాని అతనికి బోధపడదు.

ఈ సత్‌-అసత్‌(మంచి-చెడు) భావాల కారణంగా ఉత్పన్నమయ్యే హర్షశోకాలనుండి తప్పించుకోడానికై కొన్నిమార్గాలున్నాయి.

ఒకటి ధ్యానం, రెండోది, ఆ భావనలను తనవికావు అని భావించడం. ఆలోచనలు భావాలు తరంగరూపంలో బ్రహ్మాండంలో ఉన్నట్లుగా గ్రహించి వాటిని బుద్ధిద్వారా గ్రహించి దర్శించడం, చైతన్యశక్తి చేసే పనుల్ని గమనించడం చేయాలి. చైతన్యశక్తి ఏ విధంగా బుద్ధి ద్వారా ఆలోచనల్ని భావాల్ని ఉత్పన్నం చేస్తుందో, వాటినెలా మార్చి తరంగాల రూపంలో తనలో ఉంచుకుంటుందో, ఎలా వేరేబుద్ధిలో ప్రవేశపెడుతుందో కూడా గమనించాలి.

ఈ విధంగా బ్రహ్మాండంలో ఉన్న చైతన్య శక్తికి సంబంధించిన ఈ లీలామయ కార్యాన్ని (లీలను) చూడాలి.

గీతలో చైతన్యశక్తి యొక్క విధానాన్ని ఇలా వర్ణించడం జరిగింది:

బుద్ధిర్‌ జ్ఞానం అసంమోహ: క్షమా సత్యం దయా శమ:

సుఖం దు:ఖం భవో భావో భయం చాభయమేవ చ

అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశ:

భవన్తి భావం భూతానాం మత్తేవ పృథిగ్విధా:

నిర్ణయాత్మకశక్తి, యథార్థజ్ఞానం, అసమూఢత్వం, క్షమ, సత్యం, ఇంద్రియాల్ని వశపరచుకోవడం, మనోనిగ్రహం, సుఖదు:ఖాలు, ఉత్పత్తి-ప్రళయాలు, భయాభయాలు, అహింస, సమత్వం, సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి - ఇలా ఈ ప్రాణుల రకరకాల భావాలు నా ద్వారానే చైతన్య శక్తిద్వారానే ఉత్పన్నమౌతాయి.

English summary
Aastrologer told the story about Conscious energy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X