astrology: త్వరలో రాహువు, కుజ సంయోగంతో అంగారక యోగం: ఈ రాశులవారు జాగ్రత్త!!

వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే సమయంలో ఉన్నప్పుడు గ్రహ సంయోగం కలుగుతుంది. ఈ విధంగా గ్రహాల సంయోగం శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను ఇవ్వవచ్చు. ఇక రాహువు, కుజుడి సంయోగం అశుభ ఫలితాలను ఇస్తుంది.

ప్రస్తుతం మీన రాశిలో ఉన్న రాహువు సంవత్సరం పాటు అక్కడే ఉంటాడు. ఇక కుజుడు ఏప్రిల్ 23వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించి మే 31వరకు అక్కడే ఉంటాడు. ఇక ఈ పరిస్థితిలో అంగారక యోగ ఏర్పడుతుంది. ఒకే రాశిలో కుజుడు రాహువు కలవడం వల్ల ఏర్పడే అంగారక యోగం 2024 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Astrology: Angarak Yoga with Rahu and Mars conjunction soon: three zodiac signs to take care!!

మేషరాశిలో జన్మించిన వారికి 12వ ఇంట్లో అంగారక యోగం ఏర్పడుతుంది. ఇది మేషరాశి వారికి తీవ్ర హెచ్చరికను జారీ చేస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు అశుభ ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. మేష రాశి వారి విద్య, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం చాలా ఇబ్బందికరమైన, అసహ్యమైన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

మేషరాశి జాతకులకు భూముల, ఆస్తుల వివాదాలు ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అంగారక యోగం వల్ల ఆర్థిక నష్టాలు కలగవచ్చు. విపరీతమైన మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది.

కన్యారాశిలో జన్మించిన వారికి ఏడవ ఇంట్లో అంగారక యోగం ఏర్పడుతుంది. ఇది కూడా కన్యారాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో జీవితంలో అనేక కష్టాలను, సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విపరీతమైన కోపం, అసహనం ఈ సమయంలో పెరుగుతుంది.

ధనస్సు రాశి వారికి నాలుగో ఇంట్లో అంగారక యోగం ఏర్పడుతుంది .ఈ సమయంలో ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా వహించడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడటం అవసరం. పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. భార్య ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+