Astrology: అధిక శ్రావణమాసం: మేషరాశి నుండి కన్యారాశి వరకు; మంచి ఫలితాలకు పరిహారాలివే!!
జులై నెల 18వ తేదీ నుండి అధిక శ్రావణ మాసం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అధిక శ్రావణమాసంలో ద్వాదశ రాశుల వారు మెరుగైన ఫలితాల కోసం కొన్ని పూజలు పరిహారాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం మేషరాశి నుండి కన్యా రాశి వరకు ఆరు రాశుల వారు చెయ్యాల్సిన పరిహారాలు తెలుసుకుందాం.
అధిక శ్రావణ మాసంలో మేషరాశి వారు శివుడికి పాలు, మరియు నీళ్ళతో అభిషేకం చేయాలి. మేషరాశి వారు బిల్వపత్రాలను, చందనాన్ని, ఎర్రటి పువ్వులను కూడా శివుడికి సమర్పించవచ్చు. అంతేకాదు వారు ఓం నమశ్శివాయ మంత్రాన్ని పఠిస్తే మేష రాశి వారి కోరికలన్నీ తీరుతాయి.

వృషభ రాశి వారు అధిక శ్రావణ మాసంలో శివునికి ఆవుపాలు పెరుగు లేదా తేనెతో అభిషేకం చేయాలి. తెల్లటి పువ్వులను సమర్పించవచ్చు. విఘ్నేశ్వరుడికి లడ్లు సమర్పించాలి. ఇది జీవితంలో వచ్చే అవరోధాలను ఎదుర్కోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అధిక శ్రావణమాసంలో మిధున రాశి వారి శివుడికి నెయ్యితో అభిషేకం చేయాలి. ఆలయంలో పచ్చి పాలను దానం చేయాలి. అంతేకాదు చెరుకు రసాన్ని, మజ్జిగను దానం చేయాలి. ఓం నమశ్శివాయ కాల మహా కాల మంత్రాన్ని వారు జపిస్తే మిధున రాశి వారి జీవితంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
అధిక శ్రావణమాసంలో మంచి ఫలితాల కోసం కర్కాటక రాశి వారు శివుడికి ఆవు పాలతోనూ, నెయ్యి తోను అభిషేకం చేయాలి. తెల్లటి పూలను చందనాన్ని సమర్పించాలి. ధూపం వేయాలి. ఓం చంద్రమౌళేశ్వరాయ నమః అంటూ జపిస్తే జీవితంలో సత్ఫలితాలు ఉంటాయి.
అధిక శ్రావణ మాసంలో సింహ రాశి వారుఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తేనె, పంచదార, పచ్చిపాలు శివుడికి సమర్పించాలి. తెల్లని పూలు, ఎర్రని పూలు, గోధుమలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. దీంతో పాటు ఓం నమశివాయ కాల మహా కాల మంత్రాన్ని జపిస్తే మంచిది.
అధిక శ్రావణమాసంలో కన్యా రాశి వారు మెరుగైన ఫలితాల కోసం శివునికి గంగా జలాన్ని సమర్పించాలి. బిల్వపత్రాలతో, ఉమ్మెత్త పూలతో, శివుడిని పూజించాలి. చెరుకు రసాన్ని కూడా మహాదేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. వీరు కూడా మహా ఓం నమశివాయ కాల మహాకాల మంత్రాన్ని జపిస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
'తెలంగాణ అమర్నాథ్ యాత్ర'.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..?? -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !!











Click it and Unblock the Notifications