Astrology: ధనుస్సు రాశిలో సూర్య సంచారం: ఆ రాశులపై సూర్యుడి కటాక్షం.. ఎప్పుడంటే!!
గ్రహాలు అన్నింటిలోనూ సూర్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న సూర్యుడు డిసెంబర్ 16వ తేదీన ధనస్సు రాశిలో సంచరిస్తాడు. ఇక సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించటం మూడు రాశుల వారి జీవితంపైన గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.
గ్రహాలు కదలికలు వివిధ రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని గ్రహాల కదలికలు శుభ ఫలితాలను ఇస్తే, కొన్ని అశుభ సంకేతాలను ఇస్తాయి. కానీ డిసెంబర్ 16వ తేదీన ధనస్సు రాశిలోకి సూర్యుడు సంచారం మూడు రాశుల వారి జీవితాలలో అదృష్టానికి కారణమవుతుంది.

మిధున రాశి: ధనస్సు రాశి బృహస్పతిచే పాలించబడుతుంది. ధనుస్సు రాశిలో సూర్య సంచారం మిధున రాశి వారికి , ధనుస్సు రాశి వారికి , మీన రాశి వారికి ప్రయోజనాలను కలిగిస్తుంది. ధనుస్సు రాశిలో సూర్య సంచారం వల్ల మిధున రాశి వారు ఈ సమయంలో అద్భుతమైన దశను చూస్తారు. ధనుస్సు రాశిలో సూర్య సంచారం వల్ల మీరు అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏ పని ప్రారంభించినా మిధున రాశి వారు సఫలీకృతులవుతారు.
ధనుస్సు రాశి: ధనుస్సురాశిలో సూర్య సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి లబ్ధి జరుగుతుంది. ధనుస్సు రాశిలో సూర్య సంచారం సమృద్ధిని, పెరుగుదలను, గణనీయమైన వ్యక్తిగత అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన సత్ఫలితాలను ఇస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఇది అనుకూలమైన సమయం.
మీన రాశి: ధనుస్సురాశిలో సూర్య సంచారం వల్ల మీన రాశి వారికి లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో ఏ కోరికలు ఉన్న వాటిని మీన రాశి వారు తీర్చుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు కన్న కలలను నిజం చేసుకోవచ్చు. మెరుగైన అంతర్దృష్టి, భావోద్వేగాలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. మీనరాశిలో ఈ సమయంలో సానుకూలమైన శక్తి తరంగాలు ఉంటాయి. మొత్తంగా మీనరాశి వారికి ఈ సమయం బాగా లాభదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications