Astrology: త్వరలోనే చాతుర్మాసం మొదలు.. ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!!
ఆషాడ మాసం లోని ఏకాదశి నుండి కార్తీక మాసంలోని ఏకాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాస కాలంగా పరిగణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం చాతుర్మాస కాలంలో విష్ణువు నిద్రలోకి జారుకుంటారు అని నమ్ముతారు. చాతుర్మాస సమయం సంవత్సరంలో దాదాపు నాలుగు నెలల కాలం ఉంటుంది.
ఈ ఏడాది చాతుర్మాస కాలం జూన్ 29వ తేదీన ప్రారంభమై నవంబర్ 23 వ తేదీ వరకు కొనసాగుతుంది. పేరుకు తగ్గట్టుగా నాలుగు నెలల పాటు ఇది కొనసాగుతుంది. కాబట్టి దీనిని చాతుర్మాసం అన్నారు. చాతుర్మాస్య ఉత్సవాలు సాధారణంగా ఆషాఢమాసంలో దేవశయన ఏకాదశినాడు ప్రారంభమై కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి నాడు ముగుస్తాయి.

ఖచ్చితంగా చెప్పాలంటే శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక నాలుగు మాసాలు చాతుర్మాస కాలాన్ని కలిగి ఉంటాయి. చాతుర్మాస సమయంలో కొన్ని పనులు చేయడాన్ని నిషేధించారు. ఇక వాటి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాతుర్మాస సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. కొన్ని ఆహారాలు తినటం నిషిద్ధం. పొరబాటున చెయ్యకూడని పనులు చేస్తే అవి ఖచ్చితంగా జీవితంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.
ఈ సమయంలో నూతన పనులు ప్రారంభించడం, ప్రారంభోత్సవాలు చేయడం, వివాహ వేడుకలు జరుపుకోవడం, నిశ్చితార్థం చేసుకోవడం, పిల్లలకు నామకరణం చేయడం, గృహప్రవేశాలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు. చాతుర్మాస కాలంలో మంచం మీద పడుకోరాదని, నేలపైనే పడుకోవాలని చెబుతున్నారు. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయాలని సూచిస్తున్నారు.
చాతుర్మాస సమయంలో కొన్ని వస్తువులను తినడం నిషేధము అని చెబుతున్నారు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైనవి ఆహారంగా తీసుకోవడం నిషేధం అని, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. చాతుర్మాస సమయంలో నేలపైన పడుకోవడం వల్ల సూర్యభగవానుడు సంతోషిస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో మనసును భగవంతునిపై లగ్నం చేసి, అత్యంత భక్తి భావంతో పూజించాలని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications