Astrology: జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఈ పరిహారాలు చేయండి!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మపట్టికలో శుక్రుడు బలంగా ఉంటే ఆ జాతకుల జీవితంలో సంతోషం, సంపద, విలాసాలు కూడా ఉంటాయి. అయితే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారి జీవితాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. శుక్రుడు బలహీనంగా ఉన్న వారు తమకు వచ్చే ప్రతికూల ఫలితాలను నివారించటం కోసం కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి.

మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ప్రతీ శుక్రవారం ఉపవాసం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే తెల్లని వస్తువులను దానం చేయటం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి. పాలు , పెరుగు, ముత్యాలు, తెల్లని పిండి, చెక్కెర, నెయ్యి, తెల్లని వస్తువులు దానం చేస్తే మంచిది.

Astrology: Do these remedies if Venus is weak in horoscope!!

బలహీనంగా జాతకంలో శుక్రుడు ఉంటే శుక్రవారాలలోనూ, పౌర్ణమి రోజుల్లోనూ శుక్ర మంత్రాన్ని పఠించటం మంచిది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే చీమలకు చెక్కెర, గోధుమపిండి మిశ్రమాన్ని కలిపి తినిపిస్తే ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. వివాహం కానివారు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వారు కూడా తెల్లని వస్తువులను, పదార్ధాలను దానం చెయ్యాలని చెప్తున్నారు.

జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే స్నానం చేసే నీటిలో యాలుకలను వేసుకుని స్నానం చెయ్యటం శుక్రుడిని బలపరుస్తుంది. నెగటివ్ రిజల్ట్స్ రాకుండా చేస్తుంది. ప్రతికూలతలు తగ్గి శుక్రుడు బలోపేతం కావాలంటే వెండి లేదా ప్లాటినం ఉంగరాన్ని ధరించటం, లేదా గొలుసు ధరించటం మంచిది. ఈ పరిహారాలు కూడా శుక్రుడిని జాతకంలో బలోపేతం చేస్తుంది.

చేతి బొటన వేలికి వెండి ఉంగరాన్ని ధరించటం జాతకంలో శుక్రుడిని బలోపేతం చేస్తుంది. మనస్సు, బుద్ధి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే లక్ష్మీదేవిని పూజించటం మంచిది. లక్ష్మీ దేవికి సాధారణ పూజలు చెయ్యటం కూడా జాతకంలో శుక్రుడి స్థానాన్ని బలపరుస్తుంది. శుక్రుడు బలంగా ఉంటే జాతకుల జీవితాలు స్వర్గ ధామంగా మారతాయి. వారి జీవితంలో వినోదాలు, విలాసాలు, లగ్జరీ స్పష్టంగా కనిపిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+