astrology: పదేపదే ఈ వస్తువులు క్రింద పడిపోతున్నాయా? ఇది చెడుకు సంకేతం!!

ఒక్కోసారి మనం పని చేస్తున్నప్పుడు పదేపదే మన చేతుల్లో నుంచి వస్తువులు జారీ కింద పడిపోతూ ఉంటాయి. అయితే పదే పదే వస్తువులు జారి కింద పడడం కొన్ని శుభసంకేతాలను, మరికొన్ని అశుభ సంకేతాలను ఇస్తాయి. మన చేతిలో నుంచి ఐదు వస్తువులు జారిపడితే అవి జరగబోయే అశుభానికి సంకేతమని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతి నుండి జారి పడకూడని ఆ ఐదు వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన చేతి నుండి ఉప్పు ఎప్పుడు జారి కింద పడకూడదు. ఉప్పు శుక్రుడికి మరియు చంద్రుడికి సంబంధించిన వస్తువు. ఎప్పుడైతే ఉప్పు చేతిలో నుంచి జారి పడుతుందో అది మన జాతకంలో శుక్రుడు మరియు చంద్రుడి బలహీనతలను సూచిస్తుంది.

Astrology: Do these things fall down again and again? This is a bad sign!!

పదేపదే ఉప్పు జారి పడటం కుటుంబ సభ్యుల అనారోగ్యానికి ఒక సూచన. దీంతో ధన నష్టం కూడా కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి ఎప్పుడు నూనె కింద పడకూడదు. నూనె కింద పడితే ఆర్థిక నష్టం జరుగుతుందని రుణగ్రస్తులుగా మారతారని చెబుతున్నారు. పదేపదే నూనె కింద పడిపోతే అప్పుల ఊబిలో కూరుకు పోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి పాలు పదేపదే కింద పడకూడదు. పాల గిన్నె పదేపదే చేతిలో నుంచి జారి పడిపోవడం జీవితంలో రాబోయే కొన్ని సమస్యలకు సూచనగా భావిస్తారు. పాలు చంద్రుడికి సంబంధించినవి కాబట్టి, పాలు పారబోసుకుంటే మానసిక అస్వస్థత, అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇంట్లోకి పాలను తీసుకు వెళ్ళేటప్పుడే కాదు, పాలను కాచేటప్పుడు కూడా అవి పొంగిపోకుండా చూసుకోండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజకు ఉపయోగించే పూజ పళ్లెం చేతిలో నుంచి జారి పడటం ఏ మాత్రం మంచిది కాదని చెబుతారు. చేతిలో నుంచి పూజ పళ్లెం జారి పడిపోవడం వల్ల మీరు ఎంతో ఇష్టంగా పూజించే దేవుడికి కోపం వస్తుందని అంటున్నారు. ఇది మీ జీవితంలో చెడు జరగబోతుంది అని చెప్పడానికి సంకేతమని చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి సింధూరం ఎప్పుడూ కింద పడిపోకూడదు. కుంకుమ భరణి చేతి నుండి కింద పడిపోతే జీవితంలో భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదుర్కోబోతున్నారనే సంకేతమని చెబుతున్నారు. వివాహిత స్త్రీలు భర్తకు సంబంధించిన విషయంలో చెడు వార్తలు వినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పడిపోయిన కుంకుమ పైన కాలు పెట్టడం కానీ, తుడవడం కానీ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+