Astrology: రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే కాల సర్ప యోగం గురించి తెలుసా?
ఈ భూమి మీద జన్మించిన జన్మించిన ప్రతి ఒక్కరు తమ విధిని అనుసరించే జీవితాన్ని సాగించాలి. పుట్టిన నక్షత్రం, జాతకం పై ప్రభావం చూపించే గ్రహాలను బట్టి కొన్ని యోగాలు ఏర్పడతాయి. గ్రహాలు ఒక నక్షత్రంలో నుంచి మరొక నక్షత్రం లోనికి, ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించేటప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి.
మన జాతకంలో ఏర్పడే కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలుగా ఉంటాయి. కొన్ని యోగాల వల్ల జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి .అలాంటి యోగాలలో ఒకటి కాలసర్పయోగం. ఒక వ్యక్తి తన జాతకంలో కాలసర్పదోషం ఉన్నట్లయితే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే కాల సర్ప యోగం మాత్రం పేదవాళ్లను ధనికులు గా మారుస్తుంది.

మన జాతకం లోను, జీవితం మీద ప్రభావం చూపించే వాటిలో రాహువు, కేతువు చాలా ముఖ్యమైనవి. వీటిని గ్రహాలుగా ఎవరు పరిగణించరు. వీటిని నీడ గ్రహాలుగా భావిస్తారు. ఇవి అశుభ ఫలితాలను ఇస్తాయని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు. జ్యోతిష శాస్త్రంలో రాహువును ఉత్తర ధ్రువం అని, కేతువును దక్షిణ ధ్రువం అని అంటారు. రాహువు పాము ముఖాన్ని, కేతువు తోకను కలిగి ఉంటుంది.
రాహువు మరియు కేతువు ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎల్లప్పుడు అన్ని విషయాలలోనూ వెనకబడి ఉంటాడు. ఆ వ్యక్తి జాతకంలోని అన్ని ఇతర గ్రహాలు కూడా రాహు కేతువులతో ప్రభావితమై, అప్పుడు ఆ వ్యక్తి కాలసర్ప దోషాన్ని అనుభవించవలసి వస్తుంది. కాలసర్పయోగం 12 రకాలుగా ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం మరియు యోగం ప్రపంచంలో ప్రతిభావంతులైన వారి జన్మ చార్ట్ లలో తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తి యొక్క జాతకంలో రాహుకేతువులు శుభ స్థానంలో ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా వ్యక్తి చాలా డబ్బు సంపాదిస్తాడు. కాలసర్ప శుభ యోగంతో రాత్రికి రాత్రే పేదవాళ్లు ధనవంతులుగా మారతారు. కోటీశ్వరులు గా కనబడతారు.
అంతేకాదు జన్మ చార్ట్ లో ఛాయాగ్రహాలు రెండు హానికరంగా ఉంటే రాజులా ఉండే వ్యక్తి కూడా ఫకీరులా మారతాడు. రాహు కేతువులు శుభ స్థానాలలో ఉంటే వివిధ అడ్డంకులు ఉన్నా చాలా డబ్బు మరియు పురోగతికి బలమైన అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications