Astrology: పాదాలను బట్టి మీ వ్యక్తిత్వం, భవిష్యత్ తెలుసుకోండి!!
పాదాల ఆకారం మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ఒక వ్యక్తి పాదాల ఆకృతిని బట్టి వారి వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను తెలుసుకోవచ్చని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అరికాళ్ళ ఆకృతి, అరికాళ్ళలో ఏర్పడిన గుర్తులు భవిష్యత్తును తెలియజేస్తాయి. పాదాలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చదునైన పాదాలు ఉన్న వ్యక్తులు యదార్థవాదులు. వారు ఇతర వ్యక్తులతో మంచి స్నేహభావంతో ఉంటారు. వారికి స్నేహితుల నుంచి మద్దతు ఎప్పటికీ ఉంటుంది. ఎత్తైన ఒంపు ఉన్న పాదాలు కలిగిన వ్యక్తులు స్వతంత్రంగా జీవిస్తారు. వారు మేధావులు. వారిలో జీవితంపై కలలుకనే స్వభావం ఎక్కువ. స్వయం సమృద్ధి గల వ్యక్తులుగా వారు గుర్తించబడతారు.

తక్కువ వంపు ఉన్న పాదాలు కలిగిన వారు వాస్తవిక వాదులు, బహిర్ముఖులు, వారు స్వేచ్ఛగా జీవించటానికి ఇష్టపడతారు. పాదాలు ఎర్రగా, నున్నగా ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. పగిలిన మడమలు, పొడి చర్మం కలిగిన పాదాలు కలిగి ఉండటం మంచిదిగా పరిగణించబడదు.
అరికాలు నల్లగా ఉంటే అలాంటి వారు మోసం చేసే గుణం కలిగి ఉంటారు. వారికి సంతానం లేకపోవడం, డబ్బు సంక్షోభం వంటి సమస్యలు ఎప్పుడూ ఇబ్బంది పెడతాయి. పసుపు పచ్చగా అరికాళ్లు ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. వెడల్పైన పాదాలు కలిగిన వ్యక్తులు సాధారణంగా చాలా చురుగ్గా ఉంటారు. వారు ఒకే చోట ఎక్కువసేపు కూర్చోలేరు. వారు గొప్ప వక్తలుగా ఉంటారు. వారిని మేధావులుగా గుర్తిస్తారు.
చాలా చిన్న పాదాలు ఉన్నవారు రిలాక్స్ గా కూర్చోవడానికి ఇష్టపడతారు. వారు ఉద్యోగాలను నిర్వర్తించడంలో కూడా మంచివారిగా ఉంటారు. ఇక వేళ్ల విషయానికి వస్తే కాలి బొటనవేలు మాత్రమే కదపగల వ్యక్తులు చాలా సాహసోపేతంగా ఉంటారు. వారు కొత్త విషయాలను అన్వేషించడానికి, కొత్త అనుభవాల కోసం స్వతంత్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని వేళ్ళ మధ్య పెద్దపెద్ద ఖాళీలు ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రయాణాలను ఇష్టపడుతూ ఉంటారు. వారు కొత్త ప్రదేశాలను చూడటానికి ఎక్కువగా మక్కువ చూపుతారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications