Astrology: 2024లో 7 రాశులవారి సొంతింటి కల నెరవేరుతుంది.. మీరున్నారా!!
2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉందో ఇప్పటికే తెలుసుకుంటున్నారు. అయితే 2024 సంవత్సరంలో ఏ రాశి చక్ర జాతకులు నూతన ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కలిగి ఉన్నారో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాలామంది కొత్త ఇంటిని కొనుగోలు చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. 2024 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి ఆ కలలు నెరవేరబోతున్నాయి.
2024 సంవత్సరంలో కొన్ని గ్రహాల సంచారం 7 రాశుల వారికి నూతన గృహ యోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా కుజుడు, శుక్రుడు, శని స్థానాలు ఏ రాశిలో అయితే బలంగా ఉంటాయో, సానుకూల స్థానాలలో ఉంటాయో ఆ రాశుల వారు నూతన గృహ యోగాన్ని కలిగి ఉంటారు. 2024 లో మేషరాశి జాతకులు నూతన గృహ యోగాన్ని కలిగి ఉన్నారు. వీరు ఇల్లు కొనడానికి ఇది సరైన సమయం.

మేష రాశికి చెందిన జాతకులు ఈ సమయంలో ఆస్తులను కొనుగోలు చేయడంలో విజయాన్ని సాధిస్తారు. 2024 లో శని దేవుడి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి నూతన గృహ యోగం కలుగుతుంది. 2024 కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. వారు కూడా ఈ సంవత్సరం నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
2024లో సింహరాశి జాతకులు కొత్త ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక కన్యారాశి జాతకులకు కూడా 2024 మంచి సమయం. నూతన గృహాన్ని సొంతం చేసుకోవాలని కలలు కన్నవారు ఈ సమయంలో వారి కలలను నెరవేర్చుకుంటారు. 2024లో తులా రాశి వారికి ఆస్తిపరంగా జనవరి నెల చాలా ఉత్తమంగా ఉంది. ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది.
2024 లో ఇల్లు కొనడానికి తులా రాశి వారికి మంచి సమయం గా చెప్పబడింది. మీన రాశి వారు చాలాకాలంగా ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలలో ఉంటే ఈ సంవత్సరం ఆ ప్రయత్నం తప్పక నెరవేరుతుంది. మీన రాశి వారికి కూడా ఈ సంవత్సరం నూతన గృహ యోగం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications