astrology: తిధులు వాటి అధిదేవతలు.. ఫలితాలను తెలుసుకోండి!!

కాల చక్రాన్ని బట్టి లెక్కగట్టే సాధనాలలో తిథులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో తిథికి ఒక్కో దేవతను అధిపతిగా చెబుతారు. ఆయా తిథులలో వాటి అధి దేవతలను పూజించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని చెబుతారు. అయితే తిథులకు ఉండే ఆది దేవతలు ఎవరు ఆయా తిథులను బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

పాడ్యమి తిథికి అగ్ని అధిదేవత. ఈ తిథి యొక్క వ్రత ఫలం విషయానికి వస్తే సత్ఫల ప్రాప్తి కలుగుతుంది. అశ్వినీ దేవతలు విదియ తిథికి అధిదేవతలు, ఈ తిథి యొక్క వ్రత ఫలం విషయానికి వస్తే ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. తదియ తిథికి గౌరీ దేవి అధిదేవత. ఈ తిథి వ్రత ఫలంగా సుమంగళి అనుగ్రహం కలుగుతుంది.

Astrology: Know the Thithis their deities and results!!

చవితికి వినాయకుడు అధిదేవత, వ్రత ఫలంగా విఘ్న నాశనం కలుగుతుంది. పంచమీ తిథికి నాగదేవత అధిదేవత. వ్రతఫలంగా వివాహం, వంశ వృద్ధి కలుగుతుంది. షష్ఠి తిథికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అధిదేవత, వ్రత ఫలంగా పుత్ర ప్రాప్తి కలుగుతుంది. సప్తమి తిథి కి ఆదిత్యుడు అధిదేవత, వ్రతఫలంగా ఆయురారోగ్య వృద్ధి కలుగుతుంది.

అష్టమి తిధికి అష్ట మాతృకలు అధిదేవతలు, వ్రత ఫలితంగా దుర్గతి నాశనం కలుగుతుంది. నవమి తిథికి అధిదేవత, వ్రత ఫలంగా సంపద సిద్ధి కలుగుతుంది. దశమి తిథికి ఇంద్రాది దశ దిక్పాలకులు అధిదేవతలు. వ్రత ఫలంగా పాప సంహారం కలుగుతుంది. ఏకాదశి తిథికి కుభేరుడు అధిదేవత. వ్రత ఫలంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ద్వాదశికి శ్రీమహావిష్ణువు అధిదేవత వ్రత పరంగా పుణ్యం లభిస్తుంది.

త్రయోదశికి ధర్ముడు అధిదేవత. వ్రత ఫలంగా మనోవాంఛ సిద్ధి కలుగుతుంది. చతుర్దశికి రుద్రుడు అధిదేవత. వ్రత ఫలంగా మృత్యుంజయత్వం వస్తుంది. పౌర్ణమికి చంద్రుడు అధిదేవత. వ్రతఫలంగా ధన ధాన్య వృద్ధి కలుగుతుంది. అమావాస్య తిథికి అధిదేవత పితృ దేవతలు, వ్రత ఫలంగా సంతాన సౌఖ్యం కలుగుతుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+