Astrology: 2024లో ఈ రాశులవారు విదేశాలకు వెళ్ళే లక్కీ ఛాన్స్.. మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటున్నాం. ఇదే క్రమంలో 2024 సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలని తాపత్రయపడేవారి కలలు నెరవేరబోతున్నాయా? ఏ ఏ రాశుల వారు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లి ఉద్యోగం పొందాలనే కోరికను నెరవేర్చుకోబోతున్నారు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి :2024 సంవత్సరంలో కొన్ని రాశుల వారు విదేశాలకు వెళ్లడానికి, బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. మేష రాశి వారు 2024 సంవత్సరంలో విదేశీ ప్రయాణాలతో లాభాలను ఆర్జిస్తారు. ఈ సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లేందుకు వీరికి అవకాశాలు ఉన్నాయి. ఇది వీరి జీవితంలో సానుకూల ఫలితాలకు కారణమవుతుంది. మీరు విదేశాలకు వెళుతున్నట్లయితే అక్కడ వసతి సౌకర్యం కూడా మీకు సులభంగా లభిస్తుంది.

కర్కాటక రాశి :కర్కాటక రాశి వారు కూడా ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యాసంపార్జన కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది సరైన సమయం. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లడం వల్ల కర్కాటక రాశి వారు వివిధ ప్రయోజనాలను పొందుతారు.ఈ సంవత్సరం వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విదేశాల్లో స్థిరపడాలని ఆలోచిస్తున్న వారికి ఇదే సరైన సమయం.
కన్యా రాశి :కన్య రాశి జాతకులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఈ సంవత్సరం మెండుగా కనిపిస్తుంది. విదేశాలలో స్థిరపడాలన్న కోరిక ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి విదేశాలకు వెళ్లడానికి సులభంగా వీసా లభిస్తుంది. ఉన్నత ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం విదేశాలలో ఉద్యోగ అవకాశాలు లభించే వీలుంది. ఈ సంవత్సరం విదేశీయానం కన్యా రాశి వారికి ఆర్ధిక పురోగతిని కలిగిస్తుంది.
తులా రాశి :తులారాశి వారికి ఈ సంవత్సరం విదేశీయానం చేసే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ పర్యటనకు సంబంధించి ఈ సంవత్సరం మీ అన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే విదేశీ ప్రయాణాలకు సంబంధించి పత్రాల కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో జాగ్రత్త వహించాలి. మొదటి కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ చివరకు అన్ని సానుకూలంగా పూర్తవుతాయి.
వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి విదేశీయానం ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో ఆశించిన విజయాన్ని సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి 2024 సరైన సమయం. విదేశీ పౌరసత్వం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది.ఉద్యోగస్తులు 2024లో విదేశాలకు వెళ్లేందుకు విదేశీ కంపెనీల నుండి మంచి అవకాశాలను పొందుతారు.
మకర రాశి :మకర రాశి వారు విదేశీయానం ఈ సంవత్సరం చేసే అవకాశం ఉంది. విదేశాలలో పని చేస్తున్న మకర రాశి వారు ఈ సంవత్సరం ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారం చేసుకునే వ్యక్తులు విదేశీ ఒప్పందాలను చేసుకునే అవకాశముంది. ఈ సంవత్సరం భారీగా లబ్ధిని పొందే అవకాశం ఉంది. 2024లో విదేశాలకు వెళ్ళే మకర రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications