Astrology: నవంబర్ లో ముఖ్య గ్రహాల సంచారం... అన్ని రాశులపైనా ప్రభావం!!
2023 సంవత్సరం నవంబర్ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ధన త్రయోదశి, దీపావళి వంటి పండుగలు జరగనున్నాయి. అంతేకాదు నవంబర్ నెలలో వివాహాది వేడుకలు ఎక్కువగా జరగనున్నాయి. ఇక నవంబర్ మాసంలో అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపించే విధంగా అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం నవంబర్ నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది. ఇక నవంబర్ నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా నవంబర్ నెలలో ముఖ్యమైన గ్రహాల రవాణా జరగనుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే నవంబర్ 3, 2023న కన్యారాశిలో శుక్ర సంచారం చేయనుంది. ఆపై నవంబర్ 4, 2023 లో కుంభరాశిలో శని ప్రత్యక్షం కానుంది. నవంబర్ 6, 2023 న వృశ్చిక రాశిలో బుధ సంచారం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపించనుంది.
నవంబర్ 16వ తేదీన వృశ్చికరాశిలో అంగారక సంచారం చేయనుంది. నవంబర్ 17వ తేదీన వృశ్చికరాశిలో సూర్య సంచారం కానుంది. నవంబర్ 27వ తేదీన ధనుస్సురాశిలో బుధ గ్రహం సంచారం చేయనుంది. నవంబర్ 3వ తేదీన తులారాశిలో శుక్ర సంచారం జరగనుంది. వేద జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన గ్రహాలుగా పరిగణించబడే ఈ గ్రహాల సంచారం మేషరాశి నుండి మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది.
నవంబర్ నెలలో జరగనున్న ముఖ్యమైన గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులకు లబ్ది జరిగితే, మరికొన్ని రాశులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల గమనం వివిధ రాశుల వారి జాతకాల పైన మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలకు కూడా దారితీస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications