కుజుడి గోల్డెన్ పీరియడ్: ఈ రాశి వారికి 46రోజుల పాటు తిరుగుండదు!!
సౌర వ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహం కుజుడు. కుజ గ్రహం 46 రోజుల పాటు కొనసాగే గోల్డెన్ పీరియడ్ గా పిలువబడే ప్రత్యేక దిశలోకి ప్రవేశిస్తుంది. ఇది అనేక రాశిచక్రాల వారి జీవితాలలో ఆనందం నింపుతుంది. ముఖ్యంగా మకర రాశి వారికి కుజ గ్రహం 46 రోజుల పాటు అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. వారు ఏ పని చేసినా తిరుగులేని విజయాలను సాధించేలా చేస్తుంది.
మకర రాశి జాతకులకు కుజ గ్రహంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కుజ గ్రహ సంచారం మకరరాశి జాతకులకు బాగా కలిసొస్తుంది. జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 18వ తేదీ వరకు వీరిలో అన్వేషణ స్ఫూర్తి మేల్కొంటుంది. పరిశోధన ఆధారిత పనుల పై శ్రద్ధ పెడితే ఈ సమయంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.

ఆనందాన్ని మరియు శక్తిని ఇచ్చే కుజ గ్రహం మీ పరిశోధనను, జ్ఞానాన్ని పెంపొందించడానికి దాని శక్తిని మీకు అందిస్తుంది. కాబట్టి ఎవరైనా రీసెర్చ్ ప్రాజెక్ట్ లు చేసే మకర రాశి జాతకులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మెడికల్ మరియు ఐటీ కంపెనీలలో పరిశోధన రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో విజయాలు వరిస్తాయి.
ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఈ నలభై ఆరు రోజులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. వైద్య పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది ఎంతో లబ్ధి చేకూరుస్దితుం. చాలామంది ఉద్యోగాలు మారాలి అనుకునేవారికి ఇది సరైన సమయం గా సూచించబడింది. మేనేజ్మెంట్ పాత్రలలో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో అసాధారణమైన పనితీరును చూపించే అవకాశం ఉంటుంది.
ఈ సమయంలో వ్యాధుల బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి మకర రాశి జాతకులకు తగిన సామర్థ్యం ఉంటుంది. అయినప్పటికీ ఆహారం విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మసాలా ఆహారాలు, నూనె ఆహారాలకు కాస్త దూరంగా ఉండాలని చెప్పబడింది. ఈ కాలం ఉత్సాహాన్ని, నూతన అవకాశాలను, ఉల్లాసాన్ని మకర రాశి జాతకులకు అందిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications