Astrology: ధనుస్సు రాశిలో అంగారక ఉదయం: ఈ రాశులవారికి శుభకాలం!!

నూతన సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సరంలో కొన్ని పెద్ద గ్రహాల గమనంలో మార్పులు కూడా రాబోతున్నాయి. ఇక ఈ పరిణామాలు అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. 2024 సంవత్సరం జనవరి 14వ తేదీన ధనుస్సు రాశిలో కుజుడు ఉదయించనున్నాడు. ధనుస్సు రాశిలో కుజుడు ఉదయం వల్ల నాలుగు రాశుల వారి జీవితాలలో సానుకూల పరిణామాలు రాబోతున్నాయి. ఇక ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో అంగారకుడు ఉదయం వల్ల ధనుస్సు రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో వీరి సంపద మరింత పెరుగుతుంది. సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఆస్తిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ధైర్యసాహసాలు మరింత పెరుగుతాయి. మీకు అన్నింటా విజయం లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: Mars rise in Sagittarius: Auspicious season for these zodiac signs!!

సింహ రాశి
ధనుస్సురాశిలో అంగారకుడు ఉదయించటం సింహ రాశి వారికి శుభాలను కలిగిస్తుంది. ధనుస్సురాశిలో అంగారకుడు ఉదయం వల్ల నూతన దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వివాహం కానివారు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఏ పని చేసిన అదృష్టం కలిసొస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అన్ని కష్టాలనుంచి బయటపడతారు.

తుల రాశి
ధనుస్సు రాశిలో అంగారకుడు ఉదయించడం వల్ల తుల రాశి జాతకులకు చాలా శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో మీకు ఫ్యామిలీ నుండి సపోర్ట్ బాగా లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా బాగా లాభపడతారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు తీరుతాయి. ఈ సమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.

మేషరాశి
ధనుస్సు రాశిలో అంగారకుడి ఉదయం మేష రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయలక్ష్మి వరిస్తుంది. కెరీర్ లో వచ్చే అవకాశాలను కూడా అంది పుచ్చుకుంటారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో భూమిని కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+