ఏ రంగు దుస్తులు ఈ విధంగా ప్రతికూలమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

జ్యోతిష శాస్త్ర ప్రకారం వ్యక్తి యొక్క జాతకచక్రమాధారంగా,నక్షత్ర,లగ్న పరిశీలన ద్వారా గ్రహలకు అనుకూలమైన శుభ రంగులు నిర్ణయించడం జరుగుతుంది. ఇవి శాశ్వతమైన శుభ ఫలితాన్ని ఇస్తాయి. జాతకంతో సంబంధం లేకుండా తాత్కాలికమైన శుభ ఫలితాల కోరకు వారం యొక్క వారాధిపతికి సంబంధించిన రంగు అనుకూలంమైన గ్రహాలు, ఆగ్రహలకు సంబంధించిన రంగులు,వాటి ఆధారంగా ప్రతి దినం అనుకూలతలకోరకు ఆయా రంగుల బట్టలు వేసుకుంటే మేలు జరుగుతుంది.వారాధిపతికి శత్రువైన గ్రహాలకు సంబంధించిన ప్రతి కూలమైన రంగుబట్టలు వేసుకుంటే కొంత ప్రతికూల వాతవరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.

కావున ప్రతి రోజు మనం ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది, ఆయా వారాధి పతికి సంబంధించిన అనుకూల మైన రంగు బట్టలు ధరించడం వలన మానవ శరీరానికి కొంత వరకు గ్రహ అనుకూలతలు పొంది ఆరోజు తపపెట్టిన పనులు అనుకూలంగా మారేందుకు ఆయా దినాధిపతి కి సంబంధిచి, ఇతర మిత్ర గ్రహాల యొక్క అనుకూలమైన రంగు బట్టలు ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చును. ఇంటర్వులలో,ప్రయాణాలలో, చేయు ఉద్యోగంలో, వ్యాపారాలలో,కుటుంబ మరియు సామాజిక సంబంధాలు బలపడడానికి ముఖ్యంగా ఆరోగ్య పరంమైన విషయాలకు క్రింద తెలిపిన వారానికి అనుకూలమైన రంగు దుస్తులను ధరించండం వలన శుభం కలుగు తుంది.(వైద్యశాస్త్రంలో దీనిని కలర్ ధెరఫి అని అంటారు,రోగులకు ఆరోగ్యం కోరకు కలర్ ధెరపి చికిత్సతో జబ్బును బాగు చేస్తారు.

Astrology: matching color clothes to wear

ఇక వారధిపతికి శత్రుగ్రహాలకు సంబంధించి ప్రతికూలమైన రంగు దుస్తులు వేసుకుంటే ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇది గమనించి శాస్త్రం సూచించిన ప్రకారం ఆచరిస్తే మేలు జరుగుతుంది. ఇక్కడ తెలిపిన రంగులకు సంబంధించి శేడ్స్ రంగులు కూడా వేసుకోవచ్చు ఉదహారణకు వంకాయరంగు-వాయిలేట్ రంగు,పర్పుల్ కలర్. అలాగే ఎరుపు రంగునకు సంబంధించిన మేరున్ రంగు,పింక్ కలర్ చివరిగా పసుపురంగునకు సంబధించిన రంగులు క్రీంకలర్,మిల్కివైట్ మొదలగునవి.ఇది గమనించి వ్యవహరించండి తప్పక మేలే జరుగుతుంది జై శ్రీమన్నారాయణ.

ఆదివారము రోజునకు అనుకూలమైన రంగులు :-

(ఎరుపురంగు, ఆరెంజ్, మిల్కివైట్, క్రీమ్, పసుపురంగు, గ్రే కలర్,మరియు గులాబి రంగు)

ఆదివారము రోజునకు ప్రతికూలమైన రంగులు:-

(తెలుపు, నీలిరంగు, నలుపు, బ్రౌన్ కలర్)

సోమవారం రోజునకు అనుకూలమైన రంగులు :-

(మిల్కివైట్, బూడిదరంగు,ఆరెంజ్,ఆకుపచ్చ,మరియు చిలక పచ్చ)

సోమవారం రోజునకు ప్రతికూలమైన రంగులు:-

( బ్రౌన్ కలర్)

మంగళవారం రోజునకు అనుకూలమైన రంగులు :-

(ఎరుపురంగు, వంకాయరంగు, ఆరెంజ్, పసుపు రంగు,మిల్కివైట్, గ్రే కలర్,మరియు గులాబి రంగు)

మంగళవారం రోజునకు ప్రతికూలమైన రంగులు:-

( ఆకుపచ్చ, చిలకపచ్చ ,మరియు బ్రౌన్ కలర్)

బుధవారం రోజునకు అనుకూలమైన రంగులు :-

(ఆకుపచ్చ, చిలక పచ్చ,ఆరెంజ్,మరియు తెలుపు రంగు)

బుధవారం రోజునకు ప్రతికూలమైన రంగులు:-

(బుధవారం మిల్కివైట్)

గురువారం రోజునకు అనుకూలమైన రంగులు :-

(పసుపు రంగు, ఆరెంజ్,మిల్కివైట్, ఎరుపు రంగు, మెరూన్, వంకాయ రంగు, గ్రే కలర్,మరియు గులాబి రంగు.)

గురువారం రోజునకు ప్రతికూలమైన రంగులు:-

( ఆకుపచ్చ, మరియు తెలుపురంగు.)

శుక్రవారం రోజునకు అనుకూలమైన రంగులు :-

(తెలుపు రంగు, ఆకుపచ్చ,చిలక పచ్చ, బ్రౌన్ కలర్, నీలిరంగు, నలుపు రంగు ,మరియు గులాబీ రంగు)

శుక్రవారం రోజునకు ప్రతికూలమైన రంగులు:-

( ఆరెంజ్,మిల్కివైట్,మరియు గ్రే కలర్)

శనివారం రోజునకు అనుకూలమైన రంగులు :-

(నీలి రంగు, నలుపు రంగు, తెలుపు రంగు,ఆకుపచ్చ,చిలక పచ్చ,మరియు బ్రౌన్ కలర్)

శనివారం రోజునకు ప్రతికూలమైన రంగులు:-

( ఆరెంజ్,మిల్కివైట్, గ్రే కలర్, మెరూన్ కలర్, ఎరుపు రంగు,మరియు గులాబి రంగు.)

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains us what color of clothes to wear in the week days.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి