పిల్లలకు ఇష్టమైన 'మైసూర్ పాక్'.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!
పిల్లలకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అయితే స్వీట్స్ ను ఎక్కువగా బయటి నుంచి కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంట్లో చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లోనే ఈజీగా మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే శనగపిండి ఒక కప్పు, పంచదార రెండు కప్పులు, నెయ్యి 1.5 కప్పులు, నూనె అర కప్పు, నీరు అర కప్పు, యాలకుల పొడి అర టేబుల్ స్పూన్ తీసుకోవాలి.
ఇక మైసూర్ పాక్ తయారీ విధానం చూస్తే ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. నెయ్యి, నూనెను ఒక పాత్రలో కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఇప్పుడు మరో మందపాటి పాత్రను తీసుకోవాలి. అందులో పంచదార అలాగే కలిపిన పాకం పెట్టుకోవాలి. తీగ పాకం రాగానే యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు జల్లించిన శనగపిండిని కొద్దికొద్దిగా పంచదార పాకంలో వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.

ఇప్పుడు మరుగుతున్న వేడి నెయ్యి- నూనె మిశ్రమాన్ని ఒక్కో గరిటెడు శనగపిండి మిశ్రమంలో వేస్తూ వేగంగా కలుపుతూ ఉండాలి. పిండి అంతా నెయ్యి పీల్చుకున్నంత వరకూ ఇలాగే చేయాలి. మిశ్రమం దగ్గరపడి పాత్ర అంచుల నుంచి విడిపోవడం ప్రారంభించిన వెంటనే నెయ్యి రాసిన ట్రేలో పోసి సమానంగా పరచాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో చతురస్రాకారం లేదా వజ్రాకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ మైసూర్ పాక్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications