Astrology: నవగ్రహాల దోషాలు.. ఏ గ్రహ దోషాలకు ఏఏ దానాలు చేస్తే పోతాయంటే..

చాలా మంది జీవితాలలో గ్రహాలు సరైన స్థానంలో లేకపోతే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జన్మలగ్నం దృష్ట్యా, గోచారాల దృష్ట్యా గ్రహాలు అనుకూలమైన స్థానాలలో లేనప్పుడు ఆయా గ్రహాల అనుకూలతలకు సంబంధించి కొన్ని దానాలను చేసినట్లయితే సానుకూలఫలితాలు ఉంటాయని, ఆయా గ్రహాల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

రవి గ్రహ దోషం ఉన్నవారు గోధుమ పిండి, గోధుమ రొట్టె, రాగి జావ, రాగులు, మిరియాలు వంటి వస్తువులు దానం చేస్తే మంచిదని, నారింజ రంగు వస్త్రాలను దానం చేస్తే మంచిదని చెబుతున్నారు . చంద్ర గ్రహ దోషం ఉన్నవారు అన్న దానం చేస్తే మంచిదని, తెల్లని కాటన్ వస్త్రాలను దానం చేస్తే మంచిదని, బియ్యము, పాలు, నీళ్లు, పొంగలి, వెండి వస్తువులను దానం చేస్తే మంచిదని చెబుతారు.

Navagraha

కుజ గ్రహ దోషం ఉన్నవారు ఎర్రటి వస్త్రాలను దానం చేస్తే మంచిదని కందిపప్పు, మిరపకాయలు, పచ్చి ఖర్జూర, బెల్లం వ్యవసాయ పనిముట్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు.బుధగ్రహ దోషం ఉన్నవారు విద్యా సంబంధమైన వస్తువులను దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఆవుకి పచ్చ గడ్డి వేయడం, ఆకుపచ్చ వస్త్రాలు దానం చేయడం చేస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాదు పెసర పప్పు, ఆకుకూరలు, కూరగాయలు దానం చేయాలని చెబుతున్నారు.

గురు గ్రహ దోషం ఉన్నవారు పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలని చెబుతున్నారు. వారు పండ్లు, తీపి పదార్థాలు, శనగ గుగ్గిళ్ళు, తియ్యని పానీయాలు, బఠానీ గుగ్గిళ్ళు, భోజనం వంటివి దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. శుక్ర గ్రహ దోషం ఉన్నవారు రంగురంగుల వస్త్రాలను వేటినైనా దానం చేయొచ్చని చెప్తున్నారు.

ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన బొట్టు బిళ్ళలు, జడ పిన్నులు, రబ్బర్ బ్యాండ్ లు, గోళ్ల రంగులు, సెంటు, అద్దాలు, పౌడర్లు, పూలు , గోరింటాకు దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాదు బొబ్బర్లు, అలసందలు, డ్రైఫ్రూట్స్ మొదలైనవి కూడా దానం చేయవచ్చు అని చెబుతున్నారు. శని గ్రహ దోషం ఉన్నవారు నీలి రంగు వస్త్రాలను దానం చేస్తే మంచిదని చెబుతారు.

శని గ్రహ దోషం పోవాలంటే నూనె, నువ్వులు, ఇనుము, దేవాలయాలకు సిమెంట్, కార్మికులకు, పని చేసే వారికి వస్తువులు రూపంలో గాని, ధనరూపంలో గాని దానాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. రాహు గ్రహ దోషం ఉన్నవారు బూడిద రంగు వస్త్రాలను దానం చేయాలని చెబుతున్నారు. అంతే కాదు వారు ఇడ్లీలు, మినప గారెలు, సున్నుండలు దానం చేయాలని చెబుతున్నారు.నానబెట్టిన మినుములు ఆవుకు పెట్టాలని సూచిస్తున్నారు.

ఇక కేతు గ్రహ దోషం ఉన్నవారు పశువులకు, పక్షులకు, చేపలకు ఆహారం పెట్టాలని, ఉలవల పొడిని ఆవులకు పెట్టాలని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని అరుదైన రంగుల వస్త్రాలను దానం చేయడం మంచిదని చెబుతున్నారు. ఇలా నవగ్రహాల దోషాలకు సరైన దానధర్మాలు చేస్తే, దోషాలు తొలగిపోయి జీవితం సజావుగా సాగుతుందని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+