శతభిషా నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి, కుబేరుడు
జ్యోతిష్యం ప్రకారం రాహువు అంటే అందరూ భయపడతారు. కానీ అది చాలా మంచి చేస్తుందనే విషయం ఎవరూ గ్రహించలేరు. మన కర్మల ప్రకారం ఫలితాలను అనుభవించాల్సిందేకానీ రాహువు, కేతువు, శని అంటూ ఎవరూ ఏమీ చేయరు. జీవిత పాఠాలను నేర్పుతారు అంతే. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకునే రాహువుకైనా, కేతువుకైనా ఛాయా గ్రహాలని పేరుంది. మార్చి 29వ తేదీన రాహువు శతభిషా నక్షత్రం రెండో పాదంలోకి అడుగుపెడుతున్నాడు. మే 31వ తేదీ వరకు అక్కడే సంచారం చేస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు అద్భుతమైన ధనలాభాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
తులారాశి
దీర్ఘకాలికంగా మీకున్న కోరికలన్నీ నెరవేరతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా బలపడతారు. అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు దక్కుతాయి.

మకర రాశి
విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఈ సమయంలో వీరు ఎటువంటి పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు. అంతేకాకుండా అన్ని పనుల్లో గణనీయమైన విజయాలు సాధించడానికి అవకాశం కనపడుతోంది. నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అద్భుతమైన లాభాలను కళ్ల చూస్తారు.
మేష రాశి
వీరు తీసుకునే నిర్ణయాల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపుతారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆలోచనలు పెరుగుతాయి. మరింత పదునెక్కుతాయి. అంతేకాకుండా వీరు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
మిథున రాశి
చట్టపరమైన విషయాలు, న్యాయ సంబంధిత విషయాల్లో వీరు ఊహించనిరీతిలో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఎదుటివారితో ఉండే విభేదాలకు స్వస్తి చెబుతారు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి ఇది చాలా మంచి సమయం. వారికి అద్భుతంగా ఉంటుంది. మీ ఆలోచనలతో విప్లవాత్మకమైన మార్పులకు కారణమవుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. పెద్దల నుంచి ఆస్తి కలిసిరావడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications