Astrology: కుంభరాశిలో శని తిరోగమనం; ప్రతికూలతలకు ఈ పరిహారాలు చేస్తే సరి!!
కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు వస్తే, మరికొన్ని రాశులు అశుభ ఫలితాలను చూడాల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శని దేవుడు న్యాయనిర్ణేత. సహనాన్ని ఇచ్చే దేవుడు. అటువంటి శని దేవుడు కష్టాలను మాత్రమే కలిగించే దేవుడని కొందరు భావిస్తారు. కానీ అది ఏ మాత్రం కరెక్ట్ కాదు.
శని సానుకూల ఫలితాలను కూడా ఇస్తాడు. ధనవృద్ధిని ఆశీర్వదించే దేవుళ్లలో శని దేవుడు ఒకరు. కాకుంటే శని ప్రతికూల ఫలితాలను ఇస్తే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.కుంభ రాశిలో శని తిరోగమనం జూన్ 17 వ తేదీన జరుగుతుంది. రాత్రి 10. 48 నిమిషాలకు శని తిరోగమనం ప్రారంభించి ఐదు నెలల పాటు తిరోగమనం లోనే ఉంటుంది.

నవంబర్ 4వ తేదీ ఉదయం 8:26 నిమిషాల వరకు శని తిరోగమనంలోనే ప్రయాణం చేస్తుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల ఈ సమయంలో మేషరాశి, కర్కాటక రాశి, తులా రాశి, కుంభ రాశి జాతకులు జీవితాలలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. వీరు అనేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కుంభ రాశి జాతకులకు మానసిక ఒత్తిడి కలుగుతుంది. తులా రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మేష రాశి వారికి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.కర్కాటక రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉండదు.
ఇక కుంభ రాశిలో తిరోగమన స్థితిలో గమనం ఫలితంగా వచ్చే ప్రతికూలతలను ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన నివారణలు కూడా సూచించబడ్డాయి. పేదలకు అన్నం పెట్టడం ద్వారా శనిని ప్రసన్నం చేసుకోవచ్చు. పేదలకు దుప్పట్లు, నల్లని బట్టలు దానం చేయడం ద్వారా కూడా శని దేవుడికి శాంతి కలిగించవచ్చు.
పేదవారికి బూట్లను దానం చేయడం వల్ల కూడా శని దేవుడు ప్రసన్నం అవుతాడు. పేదలకు కిచిడీ మరియు నెయ్యిని దానం చేయడం వల్ల కూడా శని ప్రతికూల ప్రభావం తగ్గుతుంది ప్రతి శనివారం శని దేవుడి ఆలయంలో ఆవనూనెను ఇవ్వడం వల్ల, ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల కూడా శని తిరోగమన ప్రతికూలతలు తగ్గుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications