astrology: పాములు ఇలా కంటపడితే అదృష్టం; ఊహించని ధనలాభం!!
పాములు మనకు కనిపించిన తీరును బట్టి మన భవిష్యత్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు.
సాధారణంగా వాస్తు శాస్త్రంలో కుక్కలు, పిల్లులను చూస్తే ఏం జరుగుతుంది? వాటిని ఏ పరిస్థితుల్లో చూడొచ్చు?వంటి అనేక విషయాలను ఇప్పటికే మనం అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. అయితే పాములను చూస్తే కూడా శుభ అశుభ శకునాలు ఉన్నాయని, పాములను ఏ సమయంలో చూడొచ్చు.. ఏ సమయంలో చూడకూడదు వంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్ర నిపుణులు.

పాములు పక్కగా వెళ్తే సంకేతాలు ఇవే
సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా పొలాలకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాలలో పాములను చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన పక్కనుండే పాములు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే పాములు ఏ విధంగా కనిపిస్తే మనకు కలిసొస్తుంది? ఎలా కనిపిస్తే మనకు నష్టం జరుగుతుంది? వంటి అంశాలను పరిశీలించినట్లయితే మనం ఎక్కడికైనా బయటకు వెళుతున్నప్పుడు పాములు మన పక్కనుండి కుడివైపుగా వెళితే మనకు మంచి జరుగుతుంది. ఏ పని మీద అయితే మనం బయలుదేరి వెళ్తామో ఆ పని కచ్చితంగా పూర్తి అవుతుంది. అది మనకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. పాములు మన పక్కగా కుడివైపున వెళ్లినప్పుడు ఊహించని లాభాలు చోటు చేసుకుంటాయి.

పాములు చెట్టుపైకి పాకుతున్నట్టు కనిపిస్తే కలిగే ఫలితాలు ఇవే
ఎక్కడైనా పాము ఏదైనా చెట్టు పైకి కానీ, గోడ పైకి కానీ ఎక్కుతున్నట్టుగా కనిపిస్తే అది కూడా మనకు శుభశకునం గానే భావించాలి. పాము చెట్టు పైకి కానీ గోడ పైకి కానీ ఎక్కడం మన ఎదుగుదలను సూచిస్తుంది. మనం కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని సంకేతాన్ని ఇది ఇస్తుంది. ఇక అంతే కాదు చెట్టుపై నుంచి కిందికి పాము దిగుతున్నట్లుగా మనకు కనిపిస్తే అది కూడా శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. ఊహించని అకస్మాత్తు ధన లాభం మనకు కలుగుతుంది.

పామును ఇలా చూడకూడదు.. చూస్తే అశుభం
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాముల విషయంలో రెండిటిని మనం చూస్తే అశుభ శకనంగా భావించాలి. ఒకటి చనిపోయిన పామును చూస్తే అది అశుభసంకేతమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా చనిపోయిన పామును చూస్తే, ఆ తరువాత శివాలయానికి వెళ్లి ఆ శివుడికి పూజలు, అర్చనలు చేయడం మంచిదని సూచించబడింది. అలా శివుడిని పూజించడం వల్ల మనకు చనిపోయిన పామును చూసిన దోషాలు పోతాయని చెప్పబడుతుంది.

పాములను ఇలా చూస్తే దోషం.. పొరబాటున కూడా చూడొద్దు
ఇక పాముల విషయంలో మనం చూడకూడని రెండవది. జంటగా కలిసి ఉన్న పాములను పొరపాటున కూడా చూడకూడదు. ఒకవేళ అలా ఏవైనా పాములు తారస పడితే వాటికి దూరంగా వెళ్లిపోవాలి. మనం వాటిని చూడడం వల్ల పాముల మధ్య ప్రేమకు భంగం కలుగుతుంది. అది మనపై సర్పదోషానికి కారణం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా జంటగా కలిసి ఉన్న పాములను చూడకూడదు. పాములు కూడా మన జీవితంలోని భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ శకునాలను చెబుతాయి కాబట్టి పాము కనిపించగానే భయపడకుండా ఆ సంకేతం మనకు ఏ విషయాన్ని చెబుతుందో జాగ్రత్తగా గమనించటం మంచిది. ఒకవేళ చెడు సంకేతమే అయితే పరమశివునికి పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications