వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: కలలో పాములు కనిపిస్తే శుభమా? అశుభమా? తెలుసుకోండి!!

|
Google Oneindia TeluguNews

కలలో వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటాం. కలల్లోనూ సుస్వప్నాలు, దుస్స్వప్నాలు ఉంటాయి. మన భవిష్యత్ పై కలల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. రకరకాల కలలు రకరకాల ప్రభావాలను సూచిస్తాయి. చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు దగ్గరికి వచ్చినట్టు కలలు రావడమో, పాములు కాటేసి పోయినట్టు కలలు రావడమో, పాములు మంచం పై నుంచి కిందికి వెళ్లినట్టు కలలు రావడమో.. ఇలా రకరకాలుగా పాములకు సంబంధించిన కలలు వస్తాయి. అయితే పాములకు సంబంధించిన కలలు మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? ఎటువంటి కలలు మంచి చేస్తాయి? ఏ కలలు మనకు చెడును చేస్తాయి? వంటి అనేక వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

కలలో పాములు కనిపిస్తే ఫలితాలు ఇలా

కలలో పాములు కనిపిస్తే ఫలితాలు ఇలా

కలలో పాములు కనిపిస్తే మంచిదని, మన శక్తిసామర్థ్యాలకు పాములు కనిపించడం ప్రతీక అని సర్పశాస్త్రంలో చెప్తున్నారు. అయితే పాములు కనిపించే స్థితిని బట్టి ఫలితాలు ఉంటాయని కూడా చెబుతున్నారు. కలలో పాము కాటేసి వెళ్ళిపోయి, రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తున్నారు . ఎలాంటి ప్రమాదాలు మనకు జరగవని చెబుతున్నారు. అంతే కాదు నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే .. నెమ్మదిగా బెడ్ పైనుంచి కిందికి వెళ్ళిపోతే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెబుతున్నారు. ఇక కలలో పాముల కలయిక వస్తే అది అశుభ సూచకమని హెచ్చరిస్తున్నారు.

పాముల జంట కలయిక కలలో కనిపిస్తే జరిగేది ఇదే

పాముల జంట కలయిక కలలో కనిపిస్తే జరిగేది ఇదే

పాములు జంట కలయిక కలలోకి వస్తే మనం పితృదేవతల పేరుతో దీపాన్ని వెలిగించి, పూర్వీకులకు శాంతి చేయాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. పితృదేవతలకు సంబంధించిన కలగా దీనిని భావించాలని చెప్తున్నారు. కలలో పాము భుజాలపై ఉన్నట్టు కనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలని, భుజాలపై పాము ఉండడం కూడా హాని చేస్తుందని చెబుతున్నారు. పాములు మింగేస్తున్నట్టు కలలు వస్తే మన జీవితంలో ఇష్టమైనది ఏదైనా దూరం అవ్వడమో, వదిలేయాల్సి రావటమో చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

 పాములపై మన ఆలోచనల బట్టే కలల ఫలితాలు ఉంటాయంటున్న స్వప్న శాస్త్రం పాములు మంచం మీద కదులుతున్నట్టు కలలు రావటం లైంగిక కోరికలకు ప్రతీకగా చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో లైంగిక కోరికలు తీరని వారికి కూడా కలలో పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. విషాన్ని సూచించే పాములు కలలోకి రావడం ఒక్కొక్కసారి ఎవరితోనైనా హాని కలిగే అవకాశం ఉందన్న సంకేతాలను కూడా ఇస్తాయి. పాముల విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వచ్చినా ఎటువంటి హాని జరగదని, పాముల పట్ల ప్రతికూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వస్తే నిజ జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

పాములపై మన ఆలోచనల బట్టే కలల ఫలితాలు ఉంటాయంటున్న స్వప్న శాస్త్రం పాములు మంచం మీద కదులుతున్నట్టు కలలు రావటం లైంగిక కోరికలకు ప్రతీకగా చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో లైంగిక కోరికలు తీరని వారికి కూడా కలలో పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. విషాన్ని సూచించే పాములు కలలోకి రావడం ఒక్కొక్కసారి ఎవరితోనైనా హాని కలిగే అవకాశం ఉందన్న సంకేతాలను కూడా ఇస్తాయి. పాముల విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వచ్చినా ఎటువంటి హాని జరగదని, పాముల పట్ల ప్రతికూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వస్తే నిజ జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

పాములపై మన ఆలోచనల బట్టే కలల ఫలితాలు ఉంటాయంటున్న స్వప్న శాస్త్రం
పాములు మంచం మీద కదులుతున్నట్టు కలలు రావటం లైంగిక కోరికలకు ప్రతీకగా చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో లైంగిక కోరికలు తీరని వారికి కూడా కలలో పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. విషాన్ని సూచించే పాములు కలలోకి రావడం ఒక్కొక్కసారి ఎవరితోనైనా హాని కలిగే అవకాశం ఉందన్న సంకేతాలను కూడా ఇస్తాయి. పాముల విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వచ్చినా ఎటువంటి హాని జరగదని, పాముల పట్ల ప్రతికూల దృక్పథంతో ఉంటే కలలోకి పాములు వస్తే నిజ జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

Vastu tips: దక్షిణం దిశ వాస్తు విషయంలో జాగ్రత్త.. ఈ వస్తువులు పెడితే సర్వనాశనమే!!Vastu tips: దక్షిణం దిశ వాస్తు విషయంలో జాగ్రత్త.. ఈ వస్తువులు పెడితే సర్వనాశనమే!!

English summary
Is it auspicious or ominous to see snakes in a dream? Many people are thinking that. According to dream analysts, the results depend on the condition in which snakes appear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X