astrology: జీవితంలో చెడు కూడా చెప్పేవస్తుంది... ఇళ్ళలో ఇవి కనిపిస్తే అశుభ సంకేతాలు!!
మనిషి జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎటువంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో, అలాగే చెడు జరిగేటప్పుడు కూడా అశుభ సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జీవితంలో కష్టసుఖాలు సహజమే. కానీ మన జీవితంలో శుభాలను సూచించే శుభ సంకేతాలను గుర్తించటం కంటే, అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలా అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే అశుభ సంకేతం
ప్రతి మనిషి జీవితంలో సమస్యలు వచ్చే ముందు అనేక దుస్సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వ్యక్తులు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులను చాలావరకు నివారించే ప్రయత్నం చేయవచ్చు అనేది పెద్దల అభిప్రాయం. ఇక ఆ అశుభ సంకేతాలను చూసినట్లయితే ఇంట్లో అకస్మాత్తుగా ఎర్ర చీమలు కనిపించడం ప్రారంభిస్తే, ఆ ఇంటి సభ్యులకు ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతే కాదు ఇంటి సభ్యుల అనారోగ్యాన్ని, ధన నష్టాన్ని ఈ అశుభ సంకేతం సూచిస్తుంది.

తులసి మొక్కలు ఎండిపోతే చెడు జరుగుతుందన్న సంకేతం
చాలామంది హిందువుల ఇళ్ళల్లో తులసి మొక్కలు పెంచుతూ ఉంటారు. తులసి మొక్కలు ఎండిపోవడం కూడా అశుభ సంకేతాన్ని సూచిస్తాయి. ఇంట్లో తులసి మొక్క పదేపదే ఎండిపోతుంటే ఆ ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఎండిపోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తులసి మొక్కలు మాత్రమే కాదు, ఇంట్లో చెట్టు నిండా పువ్వులు పూసే ఆరోగ్యంగా ఉన్న మొక్కలు ఒక్కసారిగా ఎండిపోయిన దానిని అశుభశకునంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

గుడ్లగూబ అరుపులు, ఏడుపు.. ఎలుకలు, చెదపురుగులు అశుభ సంకేతం
కుటుంబంలోని వ్యక్తులకు గుడ్లగూబ అరుపులు పదేపదే వినిపిస్తే అనర్థం సంభవిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గుడ్లగూబ ఎవరి ఇంటి పైన చూసి ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదైనా మరణం సంభవించవచ్చు అన్న సంకేతాలు అని చెబుతున్నారు. కాబట్టి గుడ్లగూబ అరుపులు వినిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాదు ఇంట్లో ఆకస్మాత్తుగా ఎలుకలు, తేనెటీగలు, చెదపురుగులు కనిపిస్తే అది మంచి సంకేతం కాదని చెబుతున్నారు. ఇంట్లో తరచూ ఎలుకలు, చెదపురుగులు వస్తుంటే ఆ ఇంట్లో ఏదో అనర్థం జరుగుతుందని, ఇది చెడు సంకేతమని చెబుతున్నారు.

ఇంట్లో అద్దం పగిలిపోతే, ఫర్నీచర్ విరిగిపోతే అశుభం
ఇక ఇంట్లో అద్దం పగిలి పోతే అదికూడా అశుభ సూచకంగా చెబుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ వాటంతట అవి విరిగిపోతే అశుభం జరుగుతుందని చెబుతున్నారు. మంచాలు, కుర్చీలు, టేబుల్స్ అకస్మాత్తుగా విరిగిపోవడం దురదృష్టానికి సంకేతమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అశుభ సూచకములు ముందే గుర్తిస్తే, వాటి వల్ల కలిగే ఇబ్బందుల నుండి తొలగించుకోవడానికి, సరైన పరిహారాలు కూడా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications