ఏప్రిల్ 15 వరకు ఈ రాశులకు డబ్బుకు లోటుండదు
నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు. శనిదేవుడికి నీడ గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తోంది. ఎందుకంటే అప్పటివరకు రాహువు కదలికలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సంచారం వల్ల ఏయే రాశులకు మేలు కలుగుతోంది? వారికి ఏవిధంగా కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.
కుంభరాశి
కొన్ని సంవత్సరాల నుంచి ఈ రాశివారికి ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కూడా కాస్తంత ఉపశమనం కలుగుతుంది. కష్టపడి పనిచేసినవారికి మంచి ఫలితాలున్నాయి. రాహువు వల్ల ఉపశమనం లభిస్తుంది. శనివల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తాడు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. మంచి ఫలితాలనిస్తాయి.

మిథున రాశి
అదృష్టం బాగా కలిసివస్తోంది. సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తారు. అవి లాభసాటిగా ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంవైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆర్థికంగా బాగుండటంవల్ల గతంలో కంటే ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని కఠినంగా కాకుండా సున్నితంగా శిక్షించాల్సి ఉంటుంది.
కన్యా రాశి
ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. వాటిని చాలా సులువుగా పరిష్కరించుకుంటారు. అదృష్టం బాగుంది. ఇతరులకు మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి అందుతాయి. ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. మంచి అవకాశాలు వస్తాయి. కెరీర్ పరంగా పెద్ద మార్పు చోటుచేసుకుంటోంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు. అక్కడి పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాతే మీరు కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకునేముందు కుటుంబ సభ్యులు, బంధువులు, విదేశాల్లో స్థిరపడిన తెలిసినవారి సలహాలు కచ్చితంగా తీసుకోవాలి.












Click it and Unblock the Notifications