astrology: ఈ శని అమావాస్య చాలా ప్రత్యేకం: ఈరోజు ఈ పనులతో శనిదేవుడు ప్రసన్నం!!
జూన్ 17వ తేదీ.. నేడు శని అమావాస్య. ఈ రోజున శని మహాదశ, శని సడే సతి ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈసారి శని అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. యాదృచ్ఛికంగా ఈ రోజే శని తిరోగమనంలో సొంత రాశి అయిన కుంభరాశిలోకి వెళతాడు. ఇక ఈ రోజు శని దేవుడికి ఇష్టమైన శనివారం కావడం కూడా గమనార్హం.
అయితే శని అమావాస్య రోజు శని దేవుడి ఆశీస్సులు పొందడానికి కొన్ని పనులు చేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని అమావాస్య రోజున శని దేవుని పూజించాలి. శని దేవుడి మంత్రాలను పఠించాలి. ఓం శం శనీశ్వరాయ నమః అనేది శని దేవుడి కోసం ఎక్కువగా పఠించే మంత్రం. శని అమావాస్య రోజున ఈ అభ్యాసాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల హానికరమైన ప్రభావాలను తగ్గించటంలో సహాయపడుతుంది.

శని కరుణ ధ్యానం చేసిన వారిపై కచ్చితంగా ఉంటుంది. శని అమావాస్య నాడు ఉపవాసం పాటించి శని దేవుడికి పూజలు చేస్తే శని ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. శని అమావాస్య నాడు పండ్లు, కూరగాయలు పాలతో కూడిన సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. అంతే కాదు శని అమావాస్య నాడు శని దేవుడికి నల్లనువ్వులను సమర్పిస్తే మంచి జరుగుతుంది.
నల్ల నువ్వులు శని దేవుడికి సంబంధించినవి. వీటిని శుభప్రదంగా భావిస్తారు. శని అమావాస్య నాడు శని గ్రహానికి సంబంధించిన నల్లని వస్త్రాలు, నల్ల దుప్పట్లు, ఇనుప పాత్రలు, ఆవనూనె , నల్లని మినప్పప్పు, నల్ల నువ్వులు దానం చేస్తే మంచిదని, దానధర్మాలు చేయడం వల్ల కూడా శని ప్రతికూల ప్రభావాలు బాగా తగ్గుతాయని చెబుతున్నారు.
శని చాలీసా పారాయణం చేయడం, శని స్తోత్రాన్ని పఠించడం మంచిదని చెబుతున్నారు. అంతే కాదు శని యంత్రాన్ని శనివారాలలో పూజించడం వల్ల కూడా శని శాంతి ఇస్తాడని, మంచి కలిగిస్తాడని చెబుతున్నారు. ఈ రోజును పరమ పవిత్రమైన రోజుగా, శనిని ప్రసన్నం చేసుకునే మంచి రోజుగా చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications