Astrology: జులై 2023లో ప్రధాన గ్రహాల సంచారం.. మీ జాతకాలు మారనున్నాయ్!!
2023 సంవత్సరం జులై మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసం నుండే మన పండుగలు ప్రారంభమవుతున్నాయి. అంతేకాదు ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం జులై నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది.
ఇక జులై నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలో కి ఎప్పుడు ప్రవేశిస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జులై నెలలో సింహ రాశి లోకి కుజ గ్రహ సంచారం జరుగుతుంది. జులై 1వ తేదీన ఉదయం 5 గంటల 52 నిమిషాలకు సింహరాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు. శక్తివంతమైన గ్రహమైన కుజుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సింహ రాశి జాతకులకు పట్టిందల్లా బంగారం అవుతుంది.

జులై 7వ తేదీన సింహరాశిలోకి శుక్రుడు సంచరిస్తాడు. ఆనందానికి, విలాసానికి సంబంధించిన గ్రహమైన శుక్రుడు జులై 7వ తేదీన తెల్లవారుజామున 3 గంటల 59 నిమిషాలకు సింహరాశిలోకి సంచరిస్తాడు. సింహరాశి లోకి శుక్రుడు సంచారం వల్ల అదే రాశిలో బుధుడు కూడా ఉండడం వల్ల మేష రాశి, వృషభ రాశి, సింహ రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, తులా రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది.
ఇక కర్కాటక రాశిలోకి బుధుడి సంచారం జులై 8 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు జరుగుతుంది. బుధుడు మేధస్సు ఉన్న గ్రహం కాబట్టి కర్కాటక రాశిలో బుధుడు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఇక జులై 14వ తేదీన కర్కాటకరాశిలోనే బుధుడు ఉదయిస్తాడు. దీనివల్ల కూడా రాశిచక్ర జాతకుల జీవితంపై ప్రభావం పడుతుంది.
కర్కాటకరాశిలో సూర్యుడు సంచారం జూలై 16 వ తేదీన ఉదయం 4 గంటల 59 నిమిషాలకు జరుగుతుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక సింహరాశిలో శుక్రుడి తిరోగమనం జులై 23 2023 ఉదయం 6 గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. శుక్రుడు ప్రేమం అందించే గ్రహం , విలాసాలకు మారుపేరైన గ్రహం.
శుక్రుడు తిరోగమనం తో కూడా కొన్ని రాశుల వారికి బాగానూ, మరికొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఉంటుంది. ఇక సింహరాశిలో బుధ సంచారం జులై 25 2023 ఉదయం 4 గంటల 26 నిమిషాలకు జరుగుతుంది. మొత్తంగా ఆయా ప్రధాన గ్రహాల సంచారం వల్ల జులై నెలలో చాలామంది జాతక చక్రాలు మారనున్నాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications