Astrology: 10సంవత్సరాల తర్వాత శుక్ర-కేతు కలయిక: మూడు రాశులకు శుభం!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక అనేక పరివర్తనకు కారణంగా మారుతుంది. నవంబర్ నెలలో కన్యా రాశిలో ఉన్న శుక్రుడు, అప్పటికే అక్కడ ఉన్న కేతువుతో సంయోగం చెందడం వల్ల 12 రాశుల వారి జాతకాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. 10 సంవత్సరాల తర్వాత శుక్ర-కేతు కలయిక వల్ల కొన్ని రాశులకు లబ్ది జరుగుతుంది.

కన్య రాశిలో శుక్రుడు కేతువు కలయిక అన్ని రాశులను ప్రభావితం చేయగా, మూడు రాశుల వారికి మాత్రం ఆర్థిక లాభాన్ని, విజయాన్ని, పురోగతిని కలిగిస్తుంది. ఇక ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కన్యారాశిలో కేతువు, శుక్రుడు సంయోగం వల్ల మేషరాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో మీరు అనేక రకాల భౌతిక సౌకర్యాలను పొందగలుగుతారు.

Astrology: Venus-Ketu conjunction after 10years: Auspicious for all three zodiac signs!!

ఆర్థిక సమస్యలు ఉన్నవారు వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. వ్యాపారులకు ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ మార్కెట్లోని పెట్టుబడిదారులు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం లాభాలను ఇస్తుంది. మంచి మెరుగైన ఆర్థిక స్థితిని కేతువు శుక్రుడు సంయోగం వల్ల మేషరాశి వారు పొందుతారు.

కన్యారాశిలో కేతువు మరియు శుక్రుడు యొక్క కలయిక సింహరాశి వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.ఈ సమయంలో వీరికి అపారమైన సంపద లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఈ కలయిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి. ఇతరులను ఆకట్టుకోవడంలో ఈ సమయం వీరికి ఎంతగానో కలిసివస్తుంది. కేతువు శుక్రుడు సంయోగం కన్యారాశిలో జరగడం వల్ల కన్య రాశి జాతకులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఈ సమయంలో కన్యా రాశి వారి ఆత్మగౌరవాన్ని గణనీయంగా పెంచుతుంది. కెరీర్ పరంగాను ఈ సమయంలో బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+