Astrology: నేడు వ్యతిపాత యోగం.. ఈ మూడు రాశులవారికి కష్టాలు; ప్రమాదాలు జాగ్రత్త!!

వ్యతిపాత యోగం నేడు ఏర్పడుతుంది. ఈ యోగం నేడు ఉదయం 5 గంటల 22 నిమిషాలకు మొదలై జూన్ 26వ తారీకు ఉదయం 6 గంటల 7 నిమిషాలకు ముగుస్తుంది. వ్యతిపాత యోగం విపత్తును, దుఃఖాన్ని తీసుకువచ్చే అశుభయోగంగా చెబుతారు.ఈ యోగానికి రుద్రుడు అధినాయకుడు.

వ్యతిపాతయోగం .. ఒక అశుభ యోగం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 యోగాలలో వ్యతిపాత యోగం 17వ యోగం. ఈ యోగం నాడు ఎవరైనా కొత్త పనిని ప్రారంభిస్తే వారు ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిపాత యోగం ఉంటే ఏ పని చేసినా దురదృష్టం వెంటాడుతుంది. అనారోగ్యం కలుగుతుంది. దుఃఖ పీడితులుగా మారతారు. నేడు సంభవిస్తున్న ఈ యోగం కారణంగా మేష రాశి, కర్కాటక రాశి, తులా రాశి జాతకులు ప్రతికూల ఫలితాలను పొందుతారు.

horoscope

మేష రాశి
వ్యతిపాత యోగం కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. వ్యతిపాత యోగం వల్ల మేష రాశి జాతకులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. నమ్మిన వాళ్లతోనే మోసపోయే అవకాశం ఉంది. ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఈ జాతకుల తల్లి అనారోగ్యానికి గురయ్యే సూచన ఉంది.

కర్కాటక రాశి
వ్యతిపాత యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టాలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఈ యోగం కారణంగా మానసిక ప్రశాంతత దూరమవుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆఫీసు రాజకీయాలలో వీరు బలి అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కర్కాటక రాశి జాతకులు వ్యతిపాత యోగం సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

తులారాశి
వ్యతిపాత యోగం కారణంగా తులారాశి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఫీసులో వారు ఊహించని సమస్యను ఎదుర్కొంటారు. ఉద్యోగాలను కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. తులా రాశివారు అవసరంగా ఆఫీసు రాజకీయాలలోకి లాగబడతారు. అనవసరపు అపకీర్తిని మూటగట్టుకున్నారు. కాబట్టి తులా రాశి జాతకులు నేడు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసిన జాగరూకులై వ్యవహరించాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+