Astrology: కుబేరుడి ప్రత్యేక అనుగ్రహంతో ఈ రాశులవారు ఎప్పుడూ సంపన్నులే.. మీరున్నారా? చూసుకోండి!!
సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొన్ని రాశులపైన ప్రత్యేకమైన అనుగ్రహాన్ని కలిగిఉంటారు. ఈ కారణంగా ఆయా రాశుల వారికి వారి జీవితకాలంలో ఎప్పుడూ ఆర్థిక పరమైన సమస్యలు ఉండవని చెబుతారు.జీవితాంతం ఐశ్వర్యంతో, శ్రేయస్సుతో సంతోషంగా గడుపుతారని చెబుతారు. అంతేకాదు కుబేరుడి ఆశీస్సుల వల్ల వారి జీవితంలోని ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుబేరుడు ప్రత్యేకమైన ఆశీస్సులు అందించే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి: వృషభరాశి జాతకులకు కుబేరుడి ప్రత్యేకమైన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి. శుక్రుడిని తేజస్సు, గౌరవం, కీర్తి, ఐశ్వర్యం వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు. వృషభ రాశి జాతకులు అందర్నీ ఆకట్టుకునే గుణం కలిగి ఉంటారు. వీరి జాతకంలో శుక్రుడు కుబేరుడు దీవెనలు ఉండటంవల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు. భౌతికపరమైన ఆనందాలను అనుభవిస్తారు. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ ఉత్తమమైన వాటిని ఎంచుకుంటారు.

తులారాశి: తులా రాశి జాతకుల పైన కూడా కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. తులారాశి వారికి కూడా శుక్రుడు అధిపతి. శుక్రుడు మరియు కుబేరుడి ప్రభావంతో తులా రాశి జాతకులు ఐశ్వర్యవంతులుగా, ఏ పని చేసినా విజయం సాధించే వ్యక్తులుగా ఉంటారు. వీరు కష్టపడి పని చేయడం ద్వారా ఫలితాలను సాధిస్తారు. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బు సంబంధించిన సమస్యలు ఉండవు. వీరు దానధర్మాలు చేయడంలో ముందుంటారు.
వృశ్చిక రాశి: కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల వృశ్చికరాశి జాతకుల జీవితం బాగుంటుంది. వృశ్చికరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంతో వీరు చాలా శక్తివంతులుగా, ధైర్యవంతులుగా, పని పట్ల ఎక్కువ శ్రద్ద ఉన్న వారుగా ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్నా విజయం సాధించేవరకు విపరీతంగా శ్రమిస్తారు. వీరిపైన కూడా కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉండటంవల్ల వీరికి కూడా డబ్బు సమస్యలు ఉండవు. వీరు జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడానికి శ్రమిస్తారు.
ధనుస్సు రాశి: కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల ధనుస్సు రాశి జాతకులపై కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. ధనుస్సు రాశి జాతకులు ఎప్పుడూ ఆశావాద దృక్పథంతో ఉంటారు. ప్రతి విషయాన్ని ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా తీసుకొని పని చేస్తారు. ఎప్పుడూ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించడానికి ఇష్టపడతారు. అందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తులుగా వీరు కొనసాగుతారు. ఆర్థిక సమస్యలు లేకపోవడం వల్ల ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
కర్కాటక రాశి:కర్కాటకరాశి జాతకుల పైన కూడా కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడి స్వభావం ఎంతో స్నేహపూర్వకమైనదిగా ఉండడం వల్ల వీరు అందరితోనూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. ఇక కుబేరుడి అనుగ్రహం వల్ల జీవితంలో వీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా అస్సలు వదిలిపెట్టకుండా ఉన్నత స్థానాలకు ఎగబాకే గొప్ప లక్షణం వీరికి ఉంటుంది. వీరికి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications