ఆగస్ట్ 9న రాఖీ పౌర్ణమితో పాటు అద్భుతయోగంతో ఈ రాశులవారికి పండుగే!
నవగ్రహాలలో ఏ గ్రహానికి ఆ గ్రహం ప్రత్యేకమైనది. సూర్యుడిని గ్రహాలకు అధిపతిగా చెబుతారు. శనిదేవుడిని క్రమశిక్షణకు, కర్మలకు అధిపతిగా చెబుతారు. ఆగస్టు 9వ తేదీన సూర్యుడు మరియు శని దేవుడు నవ మరియు పంచమ స్థానాలలో ఉండటం వల్ల శక్తివంతమైన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది.
రాఖీ నాడే నవ పంచమ రాజయోగం
ఆగస్టు 9వ తేదీన శ్రావణ పౌర్ణమి, ఇదే రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి గా చెబుతారు. ఈ విశిష్టమైన రోజున ఏర్పడే నవ పంచమ రాజయోగం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
రాఖీ పౌర్ణమి వేళ ఏర్పడిన నవ పంచమ రాజయోగం మేషరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఇది వారికి మంచి ఫలితాలను ఇచ్చే సమయం.
మిధున రాశి
రాఖీ పౌర్ణమి వేళ ఏర్పడిన నవ పంచమ రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో శని తిరోగమనంలో ఉండడం వల్ల మిధున రాశి వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగులకు సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ పర్యటనలు చేయాలనుకునే వారికి ప్రయోజనాలు ఉంటాయి. జీవితంలో ప్రతికూలతలు అన్ని తొలగిపోతాయి.
సింహరాశి
రాఖీ పౌర్ణమి రోజు ఏర్పడే నవ పంచమ రాజయోగం తో సింహరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. సింహరాశి వారి ఆదాయం పెరుగుతుంది. తల్లిదండ్రులు లేదా పిల్లల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
కన్య రాశి
రాఖీ పండుగ వేళ ఏర్పడి నవ పంచమ రాజయోగం తో కన్య రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన గృహాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి
నవ పంచమ రాజయోగంతో మీనరాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కష్టపడి పనిచేసే వారిని శనిదేవుడు కరుణిస్తాడు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications