శని జయంతి నాడు శుభయోగాలు.. వీరు పట్టిందల్లా బంగారం!
శని దేవుడికి వేద జ్యోతిషశాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానముంది. శనిదేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. మన కర్మ ఫలాలను ఇచ్చే దేవుడిగా, సహనం నేర్పే దేవుడిగా గుర్తిస్తారు. అటువంటి శని దేవుడు వైశాఖ మాసం అమావాస్య తిథి నాడు జన్మించాడు. ఆ రోజును మనం శని జయంతిగా చెప్పుకుంటాం .ఈ సంవత్సరం శని జయంతి మే 27వ తేదీన వైశాఖ అమావాస్య రోజున వస్తుంది.
శని జయంతి నాడు శుభ యోగాలు
శని జయంతి రోజున గ్రహాల సంచారం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. శని జయంతి నాడు సుకర్మ యోగం, ధృతి యోగం, ద్విపుష్కర సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడతాయి. శనిజయంతి నాడు ఏడు నిమిషాల పాటు సర్వతోముఖ సిద్దియోగం, ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాలకు సర్వార్థసిద్ధి యోగం, ఉదయం 10:50 నుండి రాత్రి వరకు సుకర్మ యోగం, అలాగే ధృతి యోగం, ద్విపుష్కర యోగం ఏర్పడుతున్నాయి.

శని జయంతి నాడు ఈ రాశులవారికి అదృష్టం
ఈ శుభ యోగాల కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఇక ఈ శుభ యోగాల కారణంగా కొన్ని రాశుల వారు ఏ పని చేసినా విజయాలు వరిస్తాయి. శని జయంతి వేళ శుభాలను పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభరాశి
వృషభరాశి జాతకులకు శని జయంతినాడు ఏర్పడే శుభయోగాల కారణంగా అదృష్టం కలిసివస్తుంది. ఇక వృషభరాశి జాతకులు శని జయంతి నాడు రావి చెట్టు చుట్టూ ప్రదిక్షణలు చేసి నీటిని సమర్పించి దీపం వెలిగిస్తే శని ఆశీస్సులు వీరిపై మెండుగా ఉంటాయి. ఇలా చేస్తే శని మీ పనులు అన్నింటిలోనూ విజయాలను అందించి మీకు మేలు చేస్తాడు. ఇక వర్తక, వ్యాపారాలు చేసే వారికి శని లాభాలను కలిగేలా చేస్తాడు.
మిధున రాశి
మిధున రాశి జాతకులు శని జయంతి నాడు ఏర్పడే శుభ యోగాలతో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఇక మిధునరాశి వారు శని జయంతి నుండి మరింత ప్రయోజనాలను పొందడానికి నల్లని దుస్తులు ధరించి శని మంత్రాన్ని జపిస్తే మంచిది. 108 సార్లు ఓం శని శనైశ్చరాయ నమః అంటూ మంత్రాన్ని జపించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏలినాటి శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. శని జయంతినాడు ఏర్పడే అద్భుతమైన యోగాలతో వీరికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications