అక్టోబర్ లో బోలెడు శుభయోగాలు.. వారికి ఇల్లు, వాహనాలు, బంగారం వంటి భోగాలు!!
అక్టోబర్ నెల ముఖ్యమైన పండుగల నెల. అక్టోబర్ నెలలో ముఖ్యమైన గ్రహాల రవాణా వివిధ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను కలిగిస్తుంది. ఈ నెలలో చోటు చేసుకునే కొన్ని యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అక్టోబర్ నెలలో సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి పుష్య యోగం శుభ ఫలితాలను ఇస్తాయి.
రియల్ ఎస్టేట్, ఆస్తి, వాహనాలు, బంగారం మరియు వెండి వంటి విలువైన లోహాల ముఖ్యమైన కొనుగోళ్లు చేయాలి అనుకునే వారికి అక్టోబర్ 2023 ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మాసంలో ఏర్పడే కొన్ని శుభ యోగాలే అందుకు కారణం.

సర్వార్థ సిద్ధి యోగం ఏదైనా కొనుగోలు చేయాలి అనుకునే వారికి అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏదైనా కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇదే సరైన సమయం. సర్వార్థ సిద్ధి యోగం అక్టోబర్ నెలలో 2, 3,4,6,8,18,22, 23, 27 మరియు 30వ తేదీలలో కలుగుతుంది.
ఇంకా అక్టోబర్ 8న " రవి పుష్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో రవి పుష్య యోగాన్ని చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. అక్టోబర్ 18 మరియు 27 తేదీల్లో అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది.
అమృత సిద్ధి యోగం సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని చేయాలని అనుకుంటే, ఆ పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు అక్టోబర్ 18వ తేదీన అక్టోబర్ 27వ తేదీన అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. భూములు, వాహనాలు, బంగారం కొనుగోలు చేయడానికి, విదేశీ ప్రయాణాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. అక్టోబర్ మాసంలో ఏర్పడే మూడు యోగాలు ఈ నెలలో కొనుగోలు అవకాశాలను మరింత పెంచుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications