ప్రపంచం తట్టుకోలేని భయానక సంవత్సరం 2026.. బాబా వంగా భవిష్యవాణి!
బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత జ్యోతిష శాస్త్ర నిపుణురాలు బాబా వంగ తన భవిష్యవాణితో చాలా ప్రఖ్యాతి పొందారు. ఆమె చెప్పిన జ్యోతిష్య అంచనాలు దాదాపు నిజం అయ్యాయి. అమెరికాలో జరిగిన 9/11దాడులు, బయో వెపన్స్ తో ప్రపంచం విధ్వంసం, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి అనేక విషయాలను తన భవిష్యవాణిలో ముందే చెప్పిన బాబా వంగ ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నిజమయ్యాయి.
మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం
2025లో అనేక దేశాలలో యుద్ధాలు వస్తాయని చెప్పిన బాబా వంగ 2026సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేది ముందే అంచనా వేశారు. ఈసారి 2026 సంవత్సరం భయానకంగా ఉంటుందని, మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని బాబా వంగా పేర్కొన్నారు. 2026లో ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభాలు, కృత్రిమ మేధ అదుపు తప్పడం వంటి అనేక ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయని, 2026 చాలా ప్రమాదకరమైన సంవత్సరమని బాబా వంగా పేర్కొన్నారు.

బాబా వంగ భవిష్యవాణిలో కీలక విషయాలు
బంగారం ధరలు భారీగా పెరగడం, సెల్ ఫోన్ల కారణంగా ప్రజల ఆరోగ్యం ముప్పులో పడడం, కృత్రిమ మేధస్సు వల్ల ఎన్నో లక్షలమంది ఉద్యోగాలను కోల్పోవడం వంటి అనేక ఘటనలు జరుగుతాయని బాబా వంగ తన భవిష్యవాణిలో తెలిపారు. తూర్పున ప్రారంభమయ్యే ఒక యుద్ధం పశ్చిమ దేశాలను బలహీన పరుస్తుందని, రష్యా నుంచి ఉద్భవించే ఒక శక్తివంతమైన నాయకుడు ప్రపంచాన్ని ఏలతాడని బాబా వంగా పేర్కొన్నారు.
గ్రహాంతరవాసులతో సంబంధాలు
భారీ వరదలు, పెను భూకంపాలు, వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. 2026లో మానవులు మరో ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకుంటారు అని, గ్రహాంతరవాసులతో మాట్లాడతారని బాబా వంగా అంచనా వేశారు. మొత్తానికి బాబా వంగ చెప్పిన భవిష్యవాణికి తగ్గట్టే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిన నేపథ్యంలో 2026 సంవత్సరం ప్రపంచం తట్టుకోలేని భయానక సంవత్సరం అవుతుందని బాబా వంగ తెలిపారు.ఇంకా రెండు నెలల్లో 2025 సంవత్సరం ముగుస్తున్న క్రమంలో 2026లో బాబా వంగా జ్యోతిష్య అంచనాపై అందరి ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications