ఈ రాశులవారికి త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయ్.. మీ రాశి ఉందా?
నవ గ్రహాలలో రాహు కేతువులను ప్రధాన గ్రహాలుగా కాకుండా ఛాయా గ్రహాలుగా చెబుతారు. సహజంగా రాహువు, కేతువు రెండు గ్రహాలు కష్టాలను, హానిని కలిగించే గ్రహాలు. రాహువు కు సొంత రాశి లేనప్పటికీ అది శని గ్రహానికి సమానమైన అటువంటి ప్రభావాలను కలిగి ఉంటుందని చెబుతారు. ఈ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన రాహువు మేష రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.
రాహువు సంచారం అన్ని రాశుల వారి జాతకాల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం రాహువు సంచారం కలిసొస్తుంది. వారికి ఊహించని లబ్ధి జరుగుతుంది.మీన రాశి లో రాహువు సంచారం వల్ల వృశ్చిక రాశి వారు అసాధారణమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి జాతకులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. నచ్చిన ఉద్యోగాన్ని పొందడానికి ఇది సరైన సమయం. వృశ్చిక రాశి వారు కొత్త పనులు చెయ్యడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. అప్పుల బాధ నుండి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి విద్యార్థులు చదువులో విజయాన్ని సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.
మీన రాశి లో రాహువు సంచారం వృషభరాశి వారికి కలిసొస్తుంది. వృషభ రాశి జాతకులు బాధల నుండి విముక్తి పొంది, సంతోషకర సమయాలను ఆస్వాదించడానికి ఇది సరైన సమయం. వృషభరాశి జాతకుల వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. ఎన్నో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఆస్కారం ఇస్తుంది. ఆర్థిక సమస్యలు తీరి ఆదాయం పెరుగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. రాజకీయాలలో ఉండే వ్యక్తులు విజయాలు సాధించే అవకాశం ఉంది.
మీనరాశిలో రాహువు సంచారం వల్ల కన్య రాశి వారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యరాశి జాతకులకు ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. సామాజికంగానూ వారు గౌరవం పొందటానికి ఈ సమయం అనుకూలమైన సమయం. ఉన్నతస్థానంలో ఉండే వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే భాగస్వామ్యంతో చేసే పనులలో జాగ్రత్త అవసరం.
చంద్రబాబుకు ఇంటి నుంచి వచ్చిన భోజనం#Chandrababu #TDP #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/fDZKeOdyTJ
— oneindiatelugu (@oneindiatelugu) September 11, 2023
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications