దీపావళికి ముందు వీరికి డబ్బుల మూటలను బహుమతినిచ్చిన బృహస్పతి!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాశి మార్పు ఆయా గ్రహాల నిర్దిష్ట సమయం ప్రకారం జరుగుతూనే ఉంటుంది. బృహస్పతి గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో సంచరిస్తుంది . 2024 మే 1వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశించింది బృహస్పతి.
బృహస్పతి తిరోగమనంతో దీపావళికి ముందే అదృష్టం
2025 మే 15వ తేదీన తెల్లవారుజామున రెండు గంటల 30 నిమిషాలకు వృషభ రాశి నుంచి నిష్క్రమించి బుధుడు పాలించే గ్రహమైన మిధున రాశిలోకి ప్రవేశిస్తుంది. దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం తిరోగమనంలో వృషభ రాశిలో సంచరిస్తున్న కారణంగా కొన్ని రాశులవారి పైన కనక వర్షం కురుస్తుంది. బృహస్పతి తిరోగమనంతో దీపావళికి ముందే అదృష్టాన్ని మూటకట్టుకుంటున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
దేవగురువు బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా మేష రాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా ఉంటుంది. మేషరాశి వారికి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. బంగారం తదితర వ్యాపారాలలో స్థిరపడిన వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కాలం. ప్రయాణాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి కెరీర్ పరంగా బోలెడు లాభాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశీయానం చేసే వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సమస్యలు సునాయాసంగా పరిష్కారం అవుతాయి. ఇది వృషభ రాశి వారికి శుభ సమయం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యా రాశి జాతకులు ఈ సమయంలో కొత్త వాహనాలను, ఇళ్ళను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన లాభాలు వస్తాయి. ఇంతకాలం పై చేయి సాధించిన శత్రువులు ఈ సమయంలో మీ ధాటికి నిలవలేరు. ఉద్యోగాలు చేసేవారు పనిలో ఉన్న ఇబ్బందులను అధిగమించి విజయాలను సాధిస్తారు. ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications