వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాద్రపదమాసం విశిష్టత ఏంటి, మాసాలకు పేర్లు ఎలా పెడతారు..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

చాంద్రమానాన్ని అనుసరించి భారతీయ జ్యోతిష్కుల విషయంలోని మాసాలకు ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మం ఉంది. ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం మాసాల ప్రత్యేకం. ఈ భాద్రపద మాసం పూర్వాభాద్ర/ ఉత్తారాభాద్ర పూర్ణిమ నాడుంటే అది భాద్రపదమాసం. బాధ్రపద మాసము తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును.

ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. బాధ్రపద శుక్ల తదియ నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.

బాధ్రపద శుద్ధ చవితి వినాయక చవితి నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరి రోజున నిమజ్జనం వైభవంగా జరిపిస్తారు.

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక 1912 సంవత్సరం ఆగస్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం బాధ్రపదమాసములో ప్రారంభమైనది.

Bhadrapada masam:Know the importance, significance and history

తేది 8 సెప్టెంబర్ 2021 బుధవారం నుండి ప్రారంభమై 6 అక్టోబర్ 2021 బుధవారం వరకు భాద్రపద మాసం ఉంటుంది.

ఈ భాద్రపదమాసములో పండుగలు :-

భాద్రపద శుద్ధ పాడ్యమి *
భాద్రపద శుద్ధ విదియ *
భాద్రపద శుద్ధ తదియ వరాహ జయంతి
భాద్రపద శుద్ధ చతుర్థి - వినాయక చవితి
భాద్రపద శుద్ధ పంచమి - ఋషి పంచమి
భాద్రపద శుద్ధ షష్టి - సూర్య షష్ఠి
భాద్రపద శుద్ధ సప్తమి *
భాద్రపద శుద్ధ అష్ఠమి *
భాద్రపద శుద్ధ నవమి *
భాద్రపద శుద్ధ దశమి *
భాద్రపద శుద్ధ ఏకాదశి - పరివర్తన ఏకాదశి
భాద్రపద శుద్ధ ద్వాదశి - వామన జయంతి
భాద్రపద శుద్ధ త్రయోదశి *
భాద్రపద శుద్ధ చతుర్దశి - అనంత పద్మనాభ వ్రతం
భాద్రపద పూర్ణిమ -మహాలయ పౌర్ణమి
భాద్రపద బహుళ పాడ్యమి - మహాలయ పక్షము ప్రారంభం
భాద్రపద బహుళ విదియ *
భాద్రపద బహుళ తదియ - ఉండ్రాళ్ళ తద్దె
భాద్రపద బహుళ చవితి *
భాద్రపద బహుళ పంచమి *
భాద్రపద బహుళ షష్ఠి విశ్వనాథ సత్యనారాయణ జయంతి
భాద్రపద బహుళ సప్తమి *
భాద్రపద బహుళ అష్ఠమి *
భాద్రపద బహుళ నవమి *
భాద్రపద బహుళ దశమి *
భాద్రపద బహుళ ఏకాదశి - ఇంద్రఏకాదశి
భాద్రపద బహుళ ద్వాదశి - మహాత్మా గాంధీ జయంతి.
భాద్రపద బహుళ త్రయోదశి - కలియుగము ప్రారంభమైన రోజు.
భాద్రపద బహుళ చతుర్దశి - మాసశివరాత్రి
భాద్రపద బహుళ అమావాస్య - మహాలయ అమావాస్య

English summary
In Indian Astrology months have importance. These months are named according to the star on a full moon day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X