'భరణి'లోకి బృహస్పతి.. నవంబరు వరకు ఈ రాశులవారు కుబేరులే
జ్యోతిష్యంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈకోవలోనే దేవగురువైన బృహస్పతి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1.19 గంటలకు భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబరు 27వ తేదీ వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. గురుడి సంచారంవల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసిరానుంది. వారెవరు అనేది తెలుసుకుందాం.
సింహరాశి
భరణి నక్షత్రంలోకి దేవగురువు ప్రవేశించడంవల్ల సింహరాశివారికి బాగా కలిసి వస్తుంది. వీరు చేపట్టే ప్రతి పనిలోను అదృష్టం కలిసివచ్చి విజయవంతమవుతారు. కెరీర్ లో అత్యున్నతస్థాయికి చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభం కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.

తులారాశి
తులారాశి వారికి బృహస్పతి సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధించడంతోపాటు ఉన్నతస్థానానికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది. దీనివల్ల గతంకంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సొంత కంపెనీ ఉన్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
దేవ గురువైన బృహస్పతి భరణి నక్షత్రంలో సంచరించడంవల్ల ధనుస్సు రాశివారికి ఎంతో లాభంగా ఉంటుంది. శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ తో కూడి ప్రమోషన్ కు సంబంధించిన వార్త వింటారు. ఇది వీరిని ఆనందభరితులను చేస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు లాభాలను పెంచే విధానంపై దృష్టిసారిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.
మేషం
మేష రాశివారికి కలిసిరానుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధించడంతోపాటు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఎంతో లాభం వస్తుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది.













Click it and Unblock the Notifications